- Telugu News Photo Gallery Cinema photos Vijay last Movie thalapathy 69 is balakrishna's bhagavanth kesari remake news goes viral in social media
Thalapathy 69: అవునా.! నిజామా.! దళపతి చివరి సినిమా బాలయ్య సూపర్ హిట్‌కు రీమేక్.?
విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓ తెలుగు సూపర్ హిట్‌కు రీమేక్ అంటున్నారు కోలీవుడ్ జనాలు. అంతేకాదు ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. పొలిటికల్‌గా బిజీ అవుతున్న దళపతి విజయ్, తన ఆఖరి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటిక్ డ్రామాగా నెక్ట్స్ మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేశారు మేకర్స్.
Updated on: Nov 24, 2024 | 7:03 PM

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా ఓ తెలుగు సూపర్ హిట్‌కు రీమేక్ అంటున్నారు కోలీవుడ్ జనాలు. అంతేకాదు ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు.

పొలిటికల్‌గా బిజీ అవుతున్న దళపతి విజయ్, తన ఆఖరి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటిక్ డ్రామాగా నెక్ట్స్ మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేశారు మేకర్స్.

కానీ ఈ సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. బాలయ్య చేసిన భగవంత్ పాత్రలో విజయ్ నటిస్తుండగా శ్రీలీల పాత్రలో మలయాళ బ్యూటీ మమితా బైజు కనిపించబోతున్నారన్నది కోలీవుడ్ అప్‌డేట్.

రీసెంట్‌గా ఆర్మీ క్యాంప్‌లో జరిగిన షూటింగ్ ఆమె ట్రైనింగ్ సీన్స్‌కు సంబంధించినదే అంటున్నారు. శరత్‌కుమార్ చేసిన పాత్రను ముందు శివరాజ్ కుమార్‌తో చేయించాలనుకున్న దర్శకుడు, ఇప్పుడు మరో నటుడి కోసం ట్రై చేస్తున్నారట.

మెయిన్ విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ ప్లే చేసిన క్యారెక్ట్‌లో బాబీ డియోల్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్ ప్లేస్‌లో పూజ హెగ్డే కనిపించబోతున్నారన్న కంక్లూజన్‌కు వచ్చేశారు ఇండస్ట్రీ జనాలు.

అయితే తెలుగు వర్షన్‌లో పెద్దగా పొలిటికల్ టచ్ ఉండదు. తమిళ వర్షన్ కోసం మాత్రం ఆ ఫ్లేవర్‌ను ఎక్కువగా యాడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ ఆఖరి సినిమా కావటంతో ఈ మూవీ మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయినా దళపతి 69 రీమేక్ అన్న వార్తలపై చిత్రయూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.




