- Telugu News Photo Gallery Cinema photos Dil Raju Grand Daughter Ishika Saree Function Photos Go Viral
Dil Raju: దిల్ రాజు మనవడు, మనవరాలిని చూశారా? గ్రాండ్‌గా ఇషిక శారీ ఫంక్షన్.. ఫొటోస్ ఇదిగో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నారు నిర్మాత దిల్ రాజు. తాజాగా ఆయన మనవరాలు, హన్షితా రెడ్డి కూతురు ఇషిక శారీ ఫంక్షన్ అట్టహాసంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: Nov 24, 2024 | 4:06 PM

దిల్ రాజు మనవరాలు, హన్షిత రెడ్డి గారాల పట్టి ఇషికకు శారీ ఫంక్షన్ చేశారు. ఈ వేడుకలో దిల్ రాజు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తాజాగా ఇషిక శారీ ఫంక్షన్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు హన్షిత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దిల్ రాజు మనవడు ఆరాంశ్, మనవరాలు ఇషిక, అలాగే కుమారుడు అన్వయ్ ఈ ఫొటోల్లో ఎంతో క్యూట్ గా, అందంగా కనిపించారు.

దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తన దూరపు బంధువు తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు.

కాగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. యూఎస్ లో మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న మొదటి ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్ నే కావడం విశేషం.




