ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ షోలో తమ సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. గతంలోనే టీడీపీ అధినేత ప్రతిపక్ష హోదాలో ఈ షోలో పాల్గొని తన రాజకీయ జీవితం, పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.