Trisha: ఏళ్ళు మారుతున్న తరగని అందం.. ఈ ముద్దుగుమ్మ సొంతం
త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నది ఈ ముద్దుగుమ్మ.. ఉన్న సినిమాలు త్వరగా కంప్లీట్ చేసుకుని ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు మేడమ్ త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఇది ఇలా ఉంటె ఒక స్టార్ ఒక సినిమా ఛాన్స్ దొరికితే చాలు అనుకునే ఈ తరం హీరోయిన్స్ తో పోలిస్తే త్రిష మాత్రం ఒక్క హీరోతో రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.
Updated on: Oct 16, 2024 | 8:34 PM

తమిళ్‌తో పాటు తెలుగులోనూ సీనియర్ హీరో సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. సాధారణంగా సౌత్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్స్ నార్త్ వైపు అడుగుల వేయటం కామన్.

సౌత్‌లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్‌లో పాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్లు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు.

విజయ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నారు త్రిష. జస్ట్ విజయ్‌తోనే కాదు, అజిత్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాల్లోనూ ఆమే నాయిక. విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ పక్కన ఆమె ఎలా ఉంటారోనని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.

తమిళంలోనే కాదు.. మలయాళంలోనూ చేతినిండా సినిమాలున్నాయి సౌత్ క్వీన్ త్రిషకి. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కాంపౌండ్‌లో చేస్తున్న థగ్‌లైఫ్ కోసం ఆడియన్స్ తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు.

అన్నీ సినిమాలూ ఓ లెక్క. మెగాస్టార్ చిరంజీవి మూవీ మరో లెక్క అనే టాక్ టాలీవుడ్‌లో ఎలాగూ ఉంది. స్టాలిన్ తర్వాత చిరుతో కలిసి స్టెప్పులేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి విశ్వంభర సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. తెలుగులో ఈ సినిమా తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ అన్నది త్రిష వైపు నుంచి వినిపిస్తున్న మాట.




