- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Akhanda 2 movie begins with pooja ceremony, Photos here
Akhanda 2: పూజా కార్యక్రమాలతో అఖండ 2 ప్రారంభం.. స్పెషల్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు.. ఫొటోస్ ఇదిగో
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా లెజెండ్ బాలకృష్ణ కెరీర్ లోనే భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
Updated on: Oct 16, 2024 | 12:22 PM

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా మొదలైంది. దీనికి అఖండ 2 తాండవం అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా మొదలైంది.

అఖండ తాండవం సినిమాకు బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా.. చిన్న కూతురు తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

అఖండ 2 సినిమాకు తేజస్విని కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు నందమూరి తేజస్విని.

మొదటి భాగంలో లాగే ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడలోనూ విడుదల కానుంది అఖండ 2 తాండవం.

కాగా 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి




