Moive News: ‘బ్రో’తో పరిపూర్ణం అయ్యిందంటున్న సముద్రఖని.. లండన్ లో మహేష్ బాబు
సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 'కంగువ'. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు బాబీ డియోల్. వచ్చే నెల్లో బ్యాంకాక్‌లో సూర్య, బాబీ మీద భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Rajeev Rayala
Updated on: Jul 25, 2023 | 3:43 PM

తమిళంలో 'వినోదయ సిత్తం' సినిమా చేశాక జీవితంలో సగం పని పూర్తయిందనిపించిందని అన్నారు దర్శకుడు సముద్రఖని. తెలుగులో 'బ్రో' డైరక్ట్ చేశాక జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. ఇక నుంచి లైఫ్‌లో వచ్చేదంతా బోనస్‌గా భావిస్తానని అన్నారు. 2004లో తాను చూసిన ఓ డ్రామాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్టు తెలిపారు.

కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఆకాశం దాటి వస్తావా'. దిల్‌రాజు ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. హర్షిత్, హన్షిత నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌ని సోమవారం విడుదల చేశారు. మంచి మ్యూజికల్ సినిమా అని అన్నారు దిల్‌రాజు. యువతరం మెచ్చేలా ఉంటుందని చెప్పారు. యష్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతో మరింత పెరుగుతుందని చెప్పారు.

సూర్య హీరోగా నటిస్తున్న సినిమా 'కంగువ'. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు బాబీ డియోల్. వచ్చే నెల్లో బ్యాంకాక్‌లో సూర్య, బాబీ మీద భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారు. 'హరిహరవీరమల్లు' సినిమాతో ఆల్రెడీ సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు బాబీ. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కంగువ గురించి వార్త వైరల్ అవుతోంది.

మహేష్ ఇప్పుడు లండన్‌లో సేద దీరుతున్నారు. అక్కడ ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. లండన్ కాలింగ్ అంటూ నమ్రత పెట్టిన క్యాప్షన్, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ టీ షర్టులో సూపర్‌గా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన నటిస్తున్న 'గుంటూరు కారం' సెట్స్ మీద ఉంది. షెడ్యూల్ గ్యాప్‌లో ఉన్నారు మహేష్.

అదా శర్మ కమాండోగా మరోసారి కనిపించనున్నారు. కమాండో ఫ్రాంఛైజీలో ఆల్రెడీ రెండు పార్టుల్లో నటించారు అదా శర్మ. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్‌లోనూ భావన రెడ్డిగా కనిపించనున్నారు. సరికొత్త కమాండో యాక్షన్ అడ్వంచరస్ సినిమాగా సిద్ధమైంది. థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఇది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు అదా శర్మ.





























