- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood movies shooting updates on July 04 2024 Telugu Entertainment Photos
Entertainment: బాలీవుడ్ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు.. | ఓజి పై మాటలు కామెంట్స్.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కి ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కనుంది. పార్డో అలా కెరియరో అస్కోనా - లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న ఆయన్ని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ దేవదాస్ మూవీని చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. | సినిమాల్లో నటించడంపై ఏపీ డెప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మూడు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంటానని అన్నారు.
Updated on: Jul 04, 2024 | 9:41 PM

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కి ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కనుంది. పార్డో అలా కెరియరో అస్కోనా - లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న ఆయన్ని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ దేవదాస్ మూవీని చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు.

ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.

సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్, షకీబ్ సలీమ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా కాకుద. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. దెయ్యాల రాకపోకల కోసం ప్రతి మంగళవారం తలుపులు తీయాల్సిన ఆచారం ఉన్న ఊళ్లో, ఒకరోజు కొత్త జంట తలుపులు మూసేశాక ఏం జరిగిందనేది కాన్సెప్ట్.

కల్కి జోరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న మేకర్స్ ఆల్రెడీ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చేశారు. ఈ ఏడాదే సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్‌కి ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో అవార్డు దక్కింది. పలు హాలీవుడ్ చిత్రాలు పోటీ పడినప్పటికీ కెప్టెన్ మిల్లర్ విజేతగా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ధనుష్ నటనకు అందరూ ఫిదా అయ్యారని చెప్పారు.




