- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD Actress Disha Patani Reveals Her Tattoo Mystery
Disha Patani: దిశా పటానీ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ చెప్పేసిన కల్కి హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తెలుగు వారికి కూడ బాగా పరిచయమే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది.
Updated on: Jul 04, 2024 | 9:14 PM

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తెలుగు వారికి కూడ బాగా పరిచయమే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది.

ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది దిశా పటానీ.

ఇక సోషల్ మీడియాలో దిశా పటానీకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అందుకే ఆమెకు సంబంధించి ఏ చిన్న విషయమైనా క్షణాల్లోనే వైరలవుతుంది.

కాగా ఇటీవల దిశాపటానీ ఎడమ చేతి మోచేతిపై ‘PD’ అని రాసి ఉన్న పచ్చబొట్టు తెగ వైరలైంది. దీనిని 'ప్రభాస్ డార్లింగ్’గా డీకోడ్ చేశారు చాలామంది నెటిజన్లు.

దీంతో ప్రభాస్ తో దిశా పటానీ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అదేమీ లేదని తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చిందీ అందాల తార.

దిశాపటానీ అమెజాన్ ప్రైమ్ డే 2024 ప్రమోషన్‌ల కోసం ఇలా తాత్కాలిక టాటూ వేసుకున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. ఈ లెక్కన PD అంటే ప్రైమ్ డే అని అర్థమన్నమాట.




