- Telugu News Photo Gallery Cinema photos Tollywood Singer Mangli Visits Srisailam With Family, See Photos
Singer Mangli: శ్రీశైలంలో సింగర్ మంగ్లీ.. ఫ్యామిలీతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లింది. అక్కడి ప్రాజెక్టుతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అలాగే శ్రీశైలం మల్లికార్జునుడు, భ్రమరాంబలను దర్శించుకుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇవి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Jul 13, 2025 | 3:50 PM

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఆమె బర్త్ డే పార్టీ లో చాలా మంది గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై వివరణ ఇచ్చిన మంగ్లీ ఇప్పుడు శ్రీశైలంలో కనిపించింది. గురుపూర్ణిమ సందర్భంగా తన తల్లిదండ్రులు , సోదరితో కలిసి శ్రీశైలం జలాశయంతో పాటు అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించింది.

అలాగే భ్రమరాంబికా సమేత మల్లికార్జునుడిని దర్శించుకున్న మంగ్లీ ప్రత్యేక పూజలు చేసింది, స్వామి, అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంది.

తన శ్రీశైలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు, విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మంగ్లీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. నెటిజన్లు వీటిని చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా శ్రీశైలం గుడికి వెళ్లే సమయంలో ఒక అందమైన, అరుదైన దృశ్యం మంగ్లీ కంట పడిందట. ఎప్పుడు ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు, కృష్ణమ్మ ఒడిలో కనిపించిందట.

'ఎన్నో రంగులు విరచిమ్ముతూ, జీవితంలో ఉన్న భిన్నత్వానికి ప్రతీకగా ఈ ఇంద్రధనుస్సు కనిపించటం, ఆ దేవుని ఆశీస్సులుగా భావిస్తున్నాను' అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది మంగ్లీ.




