- Telugu News Photo Gallery Cinema photos Tollywood Rocking Star Manchu Manoj Starts Second Innings With Negative Roles in His Next Movies, Details Here
Manchu Manoj: రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్.! తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా.?
తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా..? మంచు వారబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్‌గానా..? ఆరేళ్ల గ్యాప్ తీసుకున్నది నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోడానికేనా..? తండ్రి మోహన్ బాబు బాటలోనే మనోజ్ కూడా నడుస్తున్నారా..? అసలు మనోజ్ సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉండబోతుంది.? ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు మంచు మనోజ్.
Updated on: Nov 05, 2024 | 12:20 PM

తెలుగు ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ దొరికినట్లేనా..? మంచు వారబ్బాయి దారి ఇకపై హీరోగానా లేదంటే విలన్‌గానా..? ఆరేళ్ల గ్యాప్ తీసుకున్నది నాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోడానికేనా..?

తండ్రి మోహన్ బాబు బాటలోనే మనోజ్ కూడా నడుస్తున్నారా..? అసలు మనోజ్ సెకండ్ ఇన్నింగ్ ఎలా ఉండబోతుంది.? ఎందుకో తెలియదు కానీ చాలా గ్యాప్ తీసుకున్నారు మంచు మనోజ్.

అప్పట్లో వరస సినిమాలు చేసిన మంచు వారబ్బాయి.. 2018 తర్వాత ఒక్కసారిగా బ్రేక్ తీసుకున్నారు. ఏకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని చెప్పి.. మళ్లీ మాట మార్చుకున్నారు. కానీ గ్యాప్ అయితే ఏడేళ్ల వరకు తీసుకున్నారు.

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో వరస సినిమాలు ప్రకటిస్తున్నారు. గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ కొత్తగా ఉన్నాడు అంటూ మనోజ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ మధ్య వాట్ ది ఫిష్ అనే సినిమా ప్రకటించిన మనోజ్.. మధ్యలో ఓ టాక్ షోకు హోస్టుగానూ చేసారు.

ఇక ఇప్పుడు మిరాయ్ సినిమాలో విలన్‌గా మారిపోయారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. హనుమాన్ తర్వాత మరోసారి విజువల్ వండర్‌తోనే వచ్చేస్తున్నారు తేజ సజ్జా. 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మిరాయ్‌లో విలన్‌గా నటిస్తున్నారు మనోజ్.

టీజర్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నారు మంచు వారబ్బాయి. ఈ కారెక్టర్ కోసం బాగా మేకోవర్ అయ్యారు మనోజ్. ఈ విలన్ రోల్ మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌కు బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. కేవలం మిరాయ్‌లో మాత్రమే కాదు..

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాలోనూ మనోజ్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. గరుడన్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ పాత్రను మనోజ్ చేస్తున్నారు. సూరి పాత్రను బెల్లంకొండ, శశికుమార్ పాత్రను నారా రోహిత్ పోషిస్తున్నారు.




