Tollywood Heroines: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా మారిన ముద్దుగుమ్మలు వీళ్లే…
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెస్ట్ హీరోయిన్స్‌గా పలువురు ముద్దుగుమ్మలు దూసుకుపోతున్నారు. వరుస ఆఫర్లతో అగ్రహీరోల సరసన నటిస్తూనే.. అటు తమిళ్, కన్నడ, హిందీలో సైతం ఆఫర్లను దక్కించుకుంటూ టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.
కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత 2013లో మలయాళ చిత్రం గీతాంజలి సినిమాలో హీరోయిన్గా నటించింది. తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి మహేష సరసన 'సరిలేరు నీకెవ్వరు'.. నితిన్‌కు జోడీగా 'రంగ్ దే' సినిమాల్లో నటిస్తుంది.
1 / 7
రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది కాజల్ అగర్వాల్. అందం మరియు అభినయం విషయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉన్నాయి కాజల్ ఫోటోలు.
2 / 7
3 / 7
పూజా హెగ్డే.. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీల్లో పాల్గోన్న పూజా రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత 2012లో తమిళంలో ముగమూడి సినిమాలో మొదటి సారి నటించింది. తెలుగులో నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన రాధేశ్యామ్, రామ్ చరణ్ సరసన ఆచార్యలో నటిస్తుంది.
4 / 7
శృతిహాసన్.. సింగర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది శృతిహాసన్. తమిళ స్టార్ కమల్ హాసన్, సరికా దంపతులకు 1986 జనవరి 28న చెన్నైలో జన్మించింది. 2000లో తమిళ, హిందీ బాషల్లో తెరకెక్కిన హే రామ్ సినిమా ద్వారా ఆమె సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తుంది.
5 / 7
సమంత అక్కినేని.. తమిళనాడులో సమంత విద్యాభ్యాసం పూర్తిచేసింది. మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన సమంత.. 2007లో రవివర్మన్ తెరకెక్కించిన మాస్కోవిన్ సినిమాలో నటించింది. కానీ అది అనివార్య కారణాల వలన విడుదల కాలేదు. ఇక ఆ తర్వాత తెలుగులో ఇందిరా ప్రొడక్షన్స్వో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళంలో విన్నై తండి వరువాయ పేరుతో రిమేక్ అయ్యి మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత సమంత నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది.
6 / 7
అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డాక్టర్ జీ చిత్రంలో నటిస్తోంది. అనుభూతి కాశ్యప్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్యాంపస్ కామెడీ డ్రామాలో రకుల్ మెడికల్ స్టూడెంట్‌గా కనిపించనుందట.