- Telugu News Photo Gallery Cinema photos Tollywood actress poonam bajwa stunning photos goes viral on social media
పిచ్చెక్కిస్తున్న పూనమ్..! సినిమాలు నిల్.. సోషల్ మీడియాలో జోష్ ఫుల్
ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా గుర్తుందా.. ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది.
Updated on: Sep 04, 2025 | 3:13 PM

ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా గుర్తుందా.. ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది.

ఈ క్రేజీ బ్యూటీ 2005లో కూచిపూడివెంకట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అనే మూవీతో తొలిసారిగా స్క్రీన్ పై మెరిసింది. తొలి సినిమాతోనే తన నటనతో క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కవ్వించింది. దీని తర్వాత బాస్ అనే మరో సినిమాలో నటించి మెప్పించింది. బాస్ సినిమాలో అక్కినేని నాగార్జున హీరో గా నటించారు.

ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. 2007లో హరి దర్శకత్వం వహించిన సేవాల్ చిత్రంతో ఆమె తమిళంలో నటిగా రంగప్రవేశం చేసింది. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో ఈ అమ్మడు చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించింది పూనమ్ బజ్వా. 2020లో ఈ బ్యూటీ దర్శకుడు సునీల్ రెడ్డితో కలిసి లివింగ్ టూ గెదర్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీని పై ఎలాంటి క్లారీటీ రాలేదు.

సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ నెట్టింట రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే పూనమ్ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి.