AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali Devi Jayanti: పిల్లల తల్లైనా స్టార్ హీరోయిన్‌గా ఖ్యాతిగాంచిన అలనాటి మేటి నటి అంజలీదేవి జయంతి నేడు

Anjali Devi Jayanti: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంజలీదేవి తన నటనతో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా సీత పాత్రలో అంజలి నటనకు అప్పట్లో బ్రహ్మరధం పట్టారు. అచ్చతెలుగు ఆడబడుచు అంజలీదేవి రంగస్థలంతో తన నట జీవితాన్ని ప్రారంభించి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఒక చిన్న క్యారెక్టర్ తో వెండి తెరపై అడుగు పెట్టిన అంజనీ కుమారి.. అంజలీదేవిగా జానపద, పౌరాణిక, సాంఘిక, సినిమాల్లో నడిచి తనదైన ముద్ర వేశారు. నేడు అంజలి జయంతి.

Surya Kala
|

Updated on: Aug 24, 2021 | 9:44 AM

Share
1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించారు. అసలు పేరు అంజనీ కుమారి. మంచి నటి, నర్తకి అయిన అంజనీ దేవి రంగస్థలంలో అనేక పాత్రలను పోషించారు. 1936లో రాజా హరిశ్చంద్రలో సినిమాలో లోహితాస్యుడు పాత్రని పోషించారు. ఈ సినిమాతో అంజలీదేవి వెండి తెరపై అడుగు  పెట్టారు.

1 / 7
అంజలి దేవి భర్త పి.ఆదినారాయణరావు టాలీవుడ్ లో సంగీత దర్శకుడు. అంజనీ కుమారి పేరును వెండి తెరపై అడుగు పెట్టిన తర్వాత దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చారు.

2 / 7
కష్టజీవిలో సినిమాతో హీరోయిన్ గా జర్నీ మొదలు పెట్టి సువర్ణ సుందరి, అనార్కలి, లవకుశ, ఇలా దాదాపు  500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు అంజలీదేవి

3 / 7
లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర అంజలీదేవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. అప్పట్లో అంజలి ఎక్కడికైనా వెళ్ళితే.. నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక కథనం

4 / 7
 సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారం, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నారు. అనార్కలి, సువర్ణ సుందరి, చెంచు లక్ష్మి , జయభేరి సినిమాల్లో నటనకు గాను నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డ్స్ ను అందుకున్నారు.

5 / 7
అనార్కలి సినిమాలో అంజలీదేవి హీరోయిన్ గా నటించడమే కాదు సినిమాను నిర్మించారు కూడా అనంతరం అంజలీదేవి భక్త తుకారాం  , చండీప్రియ వంటి సినిమాలను అంటే మొత్తం 27 సినిమాలను నిర్మించారు.

6 / 7
1994 లో పోలీసు అల్లుడు సినిమా అంజలీదేవి చివరి సినిమా.. జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో  చెన్నై లో అంజలీదేవి మృతి చెందారు.

7 / 7