AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Movies: ఈ సారి సమ్మర్‌లో కళే కనిపించడం లేదు… సమ్మర్‌ సినిమాల ముచ్చట..

అప్పుడెప్పుడో కరోనా టైమ్‌లో సమ్మర్‌ చప్పగా మారడం చూశాం. ఆ తర్వాత మళ్లీ ఈ సమ్మర్‌ అలాగే కనిపిస్తోంది. సమ్మర్‌ అంటే సందడి ఎలా ఉండాలీ.... దుమ్ము రేపాలి కదా.. స్టార్‌ హీరోల సినిమాలు క్యూలో నిలుచోవాలి కదా... నెక్స్ట్ ఏ సినిమా చూద్దామని ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేయాలి కదా... ఈ సారి సమ్మర్‌లో ఆ కళే కనిపించడం లేదు... డిఫరెంట్‌ కాన్సెప్టులతో వస్తున్న ఆ రెండు, మూడు సినిమాలు కూడా లేకుంటే ఏమైపోయేదో...

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Prudvi Battula|

Updated on: Apr 14, 2024 | 3:15 PM

Share
మేలో కల్కి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు ప్రభాస్‌ ఫ్యాన్స్. ఇప్పటికీ ఫైనల్‌ రిలీజ్‌ డేట్‌ మీద పర్టిక్యులర్‌గా అప్‌డేట్‌ అంటూ ఏమీ లేదు. అయినా మే ఆఖరునగానీ, జూన్‌లో గానీ విడుదలవుతుందనే మాట మాత్రం మారుమోగుతోంది. మరి... అప్పటిదాకా థియేటర్లలో హల్‌చల్‌ చేసే సినిమాలేంటి?

1 / 5
దిల్‌రాజు, పీసీ శ్రీరామ్‌, కీరవాణి, చంద్రబోస్‌.. ఈ నలుగురినీ మినహాయిస్తే, లవ్‌ మీ.. ఇఫ్‌ యు డేర్‌ టీమ్‌లో మిగిలిన వాళ్లందరూ యంగ్‌ బ్యాచే. దెయ్యాన్ని ప్రేమించే యువకుడి కథతో తెరకెక్కింది లవ్‌ మీ ఇఫ్‌ యు డేర్‌.

2 / 5
ఏప్రిల్‌ 25న విడుదల కానున్న ఈ సినిమా మీద మాంఛి హోప్స్ ఉన్నాయి మూవీ యూనిట్‌లో. ఈ చిత్రం కన్నా ముందే థియేటర్లలోకి వచ్చేస్తున్నారు లవ్‌ మౌళి. టీజర్‌తోనే డిఫరెంట్‌ కాన్సెప్ట్ అని చెప్పకనే చెప్పేశారు లవ్‌ మౌళి మేకర్స్.

3 / 5
ఏప్రిల్‌లో లవ్‌ మౌళి, లవ్‌మీ సినిమాలు సందడి చేస్తే, మేలో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాతో రెడీ అవుతున్నారు విశ్వక్సేన్‌. ఈ సినిమాకు మొదటి నుంచే పాజిటివ్‌ బజ్‌ వినిపిస్తోంది

4 / 5
డిఫరెంట్‌ కాన్సెప్టులతో పలకరించే విశ్వక్సేన్‌, గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరిలో ఏం చెబుతారోననే ఆసక్తి క్రియేట్‌ అయింది. అసలే సమ్మర్‌ సెగ, పై పెచ్చు పొలిటికల్‌ హీట్‌... ఇన్నిటి మధ్య 2024 సమ్మర్‌ సినిమా నలిగిపోతోందన్నది వాస్తవం.

5 / 5