- Telugu News Photo Gallery Cinema photos This Actress Charges Rs 40 Crores For One Movie and Her Net Worth rs 120 Crores, She Is Heroine Priyanka Chopra
Tollywood : ఒక్క సినిమాకు రూ.40 కోట్లు.. ఆస్తులు రూ.120 కోట్లు.. ఈ హీరోయిన్ క్రేజ్ చూస్తే..
ప్రస్తుతం భారతీయ సినీరంగంలో ఒక్క సినిమాకు రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. హీరోగతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్. చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాల్లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం తెలుగులో ఓ స్టార్ హీరో సరసన నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ
Updated on: May 14, 2025 | 8:32 PM

ఆమె తండ్రి సైనికులకు వైద్యం అందించిన డాక్టర్. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తూ గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటూ భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డ్ సృష్టించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే ప్రియాంక చోప్రా.

ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రా, తల్లి మధు చోప్రా సైన్యంలో వైద్యులుగా పనిచేశారు. 18 ఏళ్ల వయసులోనే మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. కానీ ఆమె నటిగా మారాలి అనుకున్నప్పుడు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అయినప్పటికీ తన తల్లి సాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత సినీరంగంలో టాప్ హీరోయిన్ గా మారింది. దాదాపు రెండు దశాబ్దాలు ఇండస్ట్రీని ఏలేసింది. 2003లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక.. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోతున్న SSMB 29 చిత్రంలో నటిస్తుంది. ఈసినిమాకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం ప్రియాంక చోప్రా ఆస్తులు రూ.120 కోట్లు ఉన్నట్లు సమాచారం.




