- Telugu News Photo Gallery Cinema photos These Heo the successful heroines as producers alia, Kriti Sanon, Kangana ranaut, Tapsee telugu cinema news
Lady Producers : హీరోయిన్స్‌గానే కాదు నిర్మాతలుగానూ సత్తా చాటుతోన్న హీరోయిన్స్..
సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి డూడ్.. లేకుంటే లావైపోతారని, మహేష్ చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు కొందరు హీరోయిన్లు. తమకు ఎంతో ఫేమ్, స్టేటస్, మనీ తెచ్చిపెట్టిన సినిమా ఇండస్ట్రీకి రిటర్న్ ఇచ్చేయాలనుకుంటున్నారు. సినిమాల్లో సంపాదించినదాన్ని ఇండస్ట్రీలోనే పెట్టుబడిగా పెట్టడానికి ఫిక్సయిపోయారు ఈ బ్యూటీస్.
Updated on: Aug 20, 2023 | 10:01 PM

Krithi sanon వెండితెర జానకి కృతిసనన్ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టేశారు. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ స్టార్ట్ చేసి దో పత్తి అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. కాజోల్‌తో కలిసి తాను కూడా నటిస్తున్నారు ఈ మూవీలో. డైరక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుంది దో పత్తి.

Alia Bhatt ఆల్రెడీ డార్లింగ్స్ మూవీని తెరకెక్కించారు ఆలియా. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ అని వెతికి మరీ పేరు పెట్టుకున్నారు ఈ బ్యూటీ. నటిగా బిజీగా ఉన్నప్పటికీ, నిర్మాతగానూ మంచి ప్రాజెక్టులు చేయాలనే సంకల్పంతో ఉన్నారు ఆలియా.

Kangana ranaut ఇటు కంగన రనౌత్ పేరు చెప్పగానే మణికర్ణిక పిల్మ్స్ బ్యానర్ గుర్తుకొస్తుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ మీదే ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కిస్తున్నారు కంగన. మిగిలిన బ్యానర్లలోనే కాదు, సొంత బ్యానర్‌లోనూ నటిగా కంటిన్యూ అవుతున్నారు కంగన.

Nayanthara భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార కూడా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌కి కోలీవుడ్‌లో మంచి పేరుంది. రీసెంట్‌గా కేఆర్‌కే మూవీని కూడా అదే బ్యానర్ మీద తెరకెక్కించారు.

Tapsee ఔట్‌సైడర్స్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ని స్టార్ట్ చేశారు తాప్సీ. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయిన సందర్బంగా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆలోచించినట్టు తెలిపారు తాప్సీ. ఈ బ్యానర్ మీదే బ్లర్ మూవీని తెరకెక్కించారు. అడపాదడపా పలువురు హీరోయిన్లు నిర్మాతలుగా మారుతున్నా, వీళ్లు మాత్రం డెడికేటెడ్‌గా సినిమాలు తీస్తామని పదే పదే చెబుతున్నారు.




