- Telugu News Photo Gallery Cinema photos There are more interesting scene between pushpa and Bhanwar Singh Shekhawat in pushpa 2 movie
Pushpa 2: పుష్ప2లో ఈ సన్నివేశాలే కీలకం.. గూస్ బంప్స్ రావడం ఖాయం..
పుష్ప సీక్వెల్‌పై ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూఊనిట్ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది..
Updated on: Nov 11, 2024 | 11:52 AM

పుష్ప2 విడుదలకు రోజులు దగ్గరపడుతోన్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 5వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

అలా తెలిసిపోయిందిగా అందరికీ.. ఎక్కడా తగ్గని హీరో, అభిమానుల ప్రేమాభిమానాలకు తగ్గాడు. అంత పెద్ద మాటను అల్లు అర్జున్ చెప్పారంటే.. ఆయనకు పాట్నా వేదికగా అందిన స్వాగతం అలాంటిది.

ముఖ్యంగా పుష్ప, భన్వర్ సింగ్‌కు మధ్య వచ్చిన సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. నిజానికి పార్ట్2పై అంచనాలు అమాంతం పెరగడానికి భన్వర్ సింగ్‌తో ఉండే సన్నివేశాలే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సీక్వెల్‌లో వీరిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకరిపై ఒకరు పగతో రగిలిపోతున్న వీరిద్దరూ ఏం చేస్తారన్న అంశాలను పార్ట్2లో చూపించనున్నారు. అయితే అంచనాలకు అనుగుణంగానే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఇందుకోసం సుకుమార్ ప్రత్యేక శద్ధ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫాజిల్ ఇదే విషయాన్ని తెలిపాడు. పార్ట్2లో భన్వర్ సింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా హీరోకు ఈ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలిపారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ రప్పించడం ఖాయమని అంటున్నారు. మరి ఎన్నో అంచనాల నడుమ వస్తున్న పుష్ప2 సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




