- Telugu News Photo Gallery Cinema photos The craze for these four South director is at peak in the industry.
Directors: ఈ నలుగురి క్రేజ్ మాములుగా లేదుగా.. దూసుకుపోతూన్న సౌత్ దర్శకులు..
వామ్మో.. అసలు వాళ్ల క్రేజ్ ఏంటో వాళ్లకైనా అర్థమవుతోందా? మన హీరోల చుట్టూ వాళ్లే.. నార్త్ హీరోల చుట్టూ వాళ్లే.. ఓన్ ఇండస్ట్రీలో దూసుకుపోతూన్న వాళ్లే.. ఇంతకీ వాళ్లెవరు హీరోయిన్లా? అనుకుంటున్నారా? ఒక్క సినిమాతో క్లిక్ అయి లక్కీ లేడీ అనిపించుకున్న హీరోయిన్ల విషయంలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో, ఈ పొరుగు కెప్టెన్ల టాపిక్‌లోనూ యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి చరిష్మా కనిపిస్తోంది.
Updated on: Apr 17, 2025 | 8:15 PM

మాతృభాష తెలుగే అయినా, కన్నడ డైరక్టర్‌గానే చూస్తారు ప్రశాంత్ నీల్‌ని. కేజీయఫ్ అలా సక్సెస్ అయిందో లేదో ఇలా అమాంతం పేరు వచ్చేసింది ప్రశాంత్ నీల్‌కి. ఆయనిప్పుడు తారక్‌తో సినిమా చేస్తున్నారు. సలార్2 చేయాలి. కేజీయఫ్3 చేయాలి. రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాలి... ఇవన్నీ కంప్లీట్ అయ్యే నాటికి మరెన్ని సినిమాలుంటాయో చేతిలో.

ఇటు అట్లీ క్రేజ్‌కి కూడా అంతే లేదు. రీసెంట్‌గా ఐకాన్‌స్టార్ పుట్టినరోజున రిలీజ్ చేసిన గ్లింప్స్ కి ఫిదా అయ్యారు జనాలు. అట్లీతో సినిమా చేయడానికి తాను ఎవర్ రెడీ అని ఆల్రెడీ చెప్పేశారు షారుఖ్. ఇటు సల్మాన్‌తోనూ ఓ సినిమా ఉండాల్సింది. కానీ బడ్జెట్ కారణంగా ప్రస్తుతానికి వాయిదా పడింది.

లోకేష్ కనగరాజ్ కూలీ పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఖైదీ2, ఆ తర్వాత విక్రమ్2, తెలుగులో ప్రభాస్‌తో పాటు స్టార్ హీరోలందరితోనూ టచ్‌లోనే ఉన్నారు. నార్త్ లో ఆమీర్‌ఖాన్ కూడా ఈ కెప్టెన్‌తో పనిచేయడానికి రెడీ అంటున్నారు. విజయ్ ఊ.. అనాలేగానీ, ఇమీడియేట్‌గా సినిమా చేయడానికి రెడీ లోకేష్.

నెల్సన్ పరిస్థితి కూడా అచ్చం ఇదే. ఆల్రెడీ సెకండ్ టైమ్ సినిమా చేస్తున్న రజనీకాంత్.. ఇంకో సారి చేయమన్నా ఓకే అంటారు. తెలుగు హీరోల గురించి కూడా అడపాదడపా చెబుతూనే ఉన్నారు నెల్సన్.

సో.. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు రిలీజ్ అయితే, ఈ కెప్టెన్ల నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో చూడాలని ఈగర్‌గా ఉన్నారు ఆడియన్స్. వీరి సినిమాలు విడుదలైతే థియేటర్లలో వసూళ్ల వర్షం పక్క అంటున్నారు జనాలు.




