- Telugu News Photo Gallery Cinema photos Taapsee Pannu doing workouts to prove as action heroine in cinema industry
Taapsee Pannu: యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న తాప్సీ
సీనియర్ హీరోయిన్ అన్న ట్యాగ్ యాడ్ అవ్వటంతో గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి యాక్షన్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు తాప్సీ. కమర్షియల్ ఫార్మాట్‌లో చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో ప్రయోగాలకు రెడీ అవుతున్నారు.
Updated on: Nov 23, 2024 | 12:33 PM

సౌత్ నుంచి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు తాప్సీ పన్ను. తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన తాప్సీ... నార్త్‌లో మాత్రం పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

కానీ రీసెంట్ టైమ్స్‌లో సక్సెస్ పరంగా మాత్రం వెనుకపడ్డారు తాప్సీ పన్ను. అందుకే యాక్షన్ రోల్స్ మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ కాపాడుకుంటేనే యాక్షన్ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంటున్నారు తాప్సీ.

నార్త్‌లో కెరీర్ స్టార్టింగ్‌లోనే బేబీ సినిమాలో యాక్షన్ రోల్ చేసిన ఈ భామ... తరువాత డిఫరెంట్ మూవీస్‌తో బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా యాక్షన్ యాంగిల్ కూడా చూపించేందుకు కష్టపడుతున్నారు.

బేబి సినిమాలో చిన్న క్యారెక్టర్‌లోనే కనిపించిన తాప్సీ, తరువాత అదే తరహా పాత్రలో నామ్ షబానా సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావటంతో వరుసగా యాక్షన్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. గేమ్ ఓవర్, తప్పడ్, రష్మి రాకెట్ లాంటి సినిమాల్లో తాప్సీ పెర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్ ఈ బ్యూటీ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.

తాజాగా మరోసారి తన లక్కీ జానర్ మీద దృష్టి పెట్టారు ఈ బ్యూటీ. గాంధారి అనే సినిమాలో కిడ్నాప్ అయిన కూతుర్ని వెతికే తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్‌లో నటిస్తున్నారు తాప్సీ. ఎలాగైనా ఈ మూవీతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని కష్టపడుతున్నారు.




