- Telugu News Photo Gallery Cinema photos Super Star Mahesh Babu Birthday Special His Murari Movie Re release in Theaters on August 09 Telugu Heroes Photos
SSMB 29: సూపర్‌స్టార్ ఏం ప్లాన్ చేస్తున్నారు.. డబుల్ బొనాంజా గ్యారంటీనా.?
పుట్టినరోజంటే పండగే కదా.. మరి పండగంటే ఎంత సందడి ఉండాలి? అందులోనూ సూపర్‌స్టార్ పుట్టినరోజు పండగంటే ఇంకెంత స్పెషల్‌గా ఉండాలి. గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఆ సందడి ఈ ఏడాది కూడా ఉంటుందా? లేకుంటే పాత జ్ఞాపకాలతో సరిపెట్టుకోవాల్సిందేనా? జక్కన్న ఏం చేస్తున్నారు? కృష్ణవంశీ ఏం చేస్తారు? మహేష్ పుట్టినరోజుకు ఎవరు ఏం గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు.! ధమ్ అదిరిపోవాలి అక్కయ్యో అని మహేష్ అంటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించింది జనాలకు.
Updated on: Jul 20, 2024 | 12:46 PM

మహేష్ బర్త్ డేకి పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఆ డేట్ కూడా మిస్ అయ్యింది. ఈ టైమ్‌లో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లటంతో ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్ ఇప్పట్లో లేనట్టేనా అని టెన్షన్ పడుతున్నారు. మహేష్ ఇంకా వెకేషన్ మూడ్‌లోనే ఉండటంతో కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.? అది ఎప్పటికి కంప్లీట్ చేస్తారు? అని ఫీల్ అవుతున్నారు అభిమానులు.

ధమ్ అదిరిపోవాలి అక్కయ్యో అని మహేష్ అంటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించింది జనాలకు. అలాంటి ధమ్ మసాలా బిర్యానీని మళ్లీ ఎప్పుడు వడ్డిస్తారా అని అడగాలనిపిస్తోంది ఇప్పుడు అభిమానులకు.

పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు సమయం కూడా ఎక్కువే పడుతుందని ఎంత సర్దుకుందామనుకున్నా.! ఎక్కడో ఓ మూల.. ఇంకెప్పుడు బాసూ అని అనాలనిపిస్తోంది ఘట్టమనేని సైన్యానికి. ఎప్పుడూ సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజుకు మహేష్ అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందేది.

ఈ ఏడాది కూడా అలాంటి గిఫ్టే రెడీ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ రోజు రానే వచ్చింది. ఏ మాత్రం సర్‌ప్రైజ్ చేయకుండా వెళ్లిపోయింది. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజుకైనా ఏదో ఒకటి ఇవ్వకపోతారా? అని ఎదురుచూపులు కనిపించాయి.

కానీ ఈ సారి కూడా జక్కన్న నుంచి ఊపు ఏమీ కనిపించడం లేదు. పుట్టినరోజు ప్రత్యేకతలు ఏమీ ఉండకపోవచ్చనే మాటలే వైరల్ అవుతున్నాయి. కానీ, మీరేం ఫికర్ కావద్దు నేనున్నా అంటూ మహేష్ ఫ్యాన్స్ కోసం మురారిని రెడీ చేస్తున్నారట కృష్ణవంశీ.

దాంతో అందరి ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడలా మురారి వచ్చింది. రీ రిలీజ్‌లలో రికార్డులకు తెరతీసాడు సూపర్ స్టార్. థియేటర్స్ దగ్గర ఆ గోలేంటి.. ఆ రచ్చేంటి.. ఎవరైనా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందేమో అనుకోవాల్సిందే..!

రీ రిలీజ్‌ల టైమ్ అయిపోయింది.. పాత సినిమాలని మళ్లీ రిలీజ్ చేయడం వేస్ట్ ఇంక.. అనవసరంగా క్లాసిక్స్‌ను ఖరాబ్ చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు అనుకుంటారు. కానీ అప్పుడొస్తుంది ఒక సినిమా.. వచ్చి రప్ఫాడిస్తుంది.




