Pushpa 3: పుష్ప 3పై క్లారిటీ..ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్
పుష్ప 3 ఎప్పుడు ఉండబోతుంది..? ఎలా ఉండబోతుంది..? పార్ట్ 3 కోసమే సమాధానం లేని ప్రశ్నలెన్నో సెకండ్ పార్ట్‌లో సుకుమార్ వదిలేసారా..? పార్ట్ 3 కోసం ఏం దాచేసారు..? రైజ్, రూల్ కాకుండా ర్యాంపేజ్‌లో ఏం చూపించే ప్రయత్నం చేస్తున్నారు..? అవన్నీ కాదండీ.. పార్ట్ 3 ఉంటుందా లేదా..? వీటన్నింటిపై సుకుమార్ ఏమంటున్నారు..?
Updated on: Sep 08, 2025 | 10:10 PM

పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ ఆడించారు. ఇంటా బయటా తేడాలేకుండా అన్ని చోట్లా మోత మోగించాడు పుష్పరాజ్.

నార్త్‌లో అయితే 900 కోట్లు కొల్లగొట్టి నెంబర్ వన్ పీఠంపై కూర్చున్నారు బన్నీ. పుష్ప 2 విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్.. కానీ పార్ట్ 3 విషయంలోనే కన్ఫ్యూజన్‌లో పడిపోయారు.

పుష్ప 2 అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం ఫ్యాన్స్, ఆడియన్స్‌ను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్. అప్పట్లో వచ్చిన Where Is Pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప2 రూల్‌లో కనబడలేదు.

ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు సుక్కు. పార్ట్ 3లో వీటన్నింటికీ ఆన్సర్ ఇస్తానంటున్నారు లెక్కల మాస్టారు.దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్న సుకుమార్.. పుష్ప 3 కచ్చితంగా ఉంటుందన్నారు.

కాకపోతే అది సెట్స్‌పై రావడానికి కాస్త టైమ్ పడుతుందంతే. ఈ లోపు అట్లీ సినిమాను పూర్తి చేయనున్నారు అల్లు అర్జున్. ఇక రామ్ చరణ్‌తో చేయాల్సిన సినిమాను సుకుమార్ కూడా కంప్లీట్ చేయనున్నారు. వీటి తర్వాత పుష్ప ర్యాంపేజ్ ఉండే అవకాశముంది.




