- Telugu News Photo Gallery Cinema photos SSMB29 Update: Rajamouli's Birthday Reveal and November Event Announcement
SSMB29: రాజమౌళి లో ఏంటి ఈ చేంజ్.. వరుస అప్‌డేట్ తో షేక్ చేస్తున్న దర్శక ధీరుడు
ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఓ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా తొలిసారి సినిమా గురించి అఫీషియల్ ట్వీట్ చేశారు. ఇంతకీ జక్కన్న ఏం చెప్పారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు హ్యాపీయేనా..? చూద్దాం. ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29.
Updated on: Aug 11, 2025 | 7:10 PM

ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీ నుంచి అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా... ఇంత వరకు ఒక్క విషయం కూడా అఫీషియల్‌గా రివీల్ చేయలేదు మేకర్స్.లాస్ట్ ఇయర్ బర్త్‌డే అప్‌డేట్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసినా... జక్కన్న లైట్ తీసుకున్నారు.

ఆ తరువాత చాలా అకేషన్స్‌లో అఫీషియల్ రివీల్ ఉంటుందన్న ప్రచారం జరిగినా.. మూవీ టీమ్ మాత్రం సైలెంట్‌గానే ఉంటూ వచ్చింది. ఫైనల్‌గా సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా తొలిసారి జక్కన్న ఓ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.

మహేష్ ఫేస్ రివీల్ చేయకుండా ఓ ప్రీ లుక్ వదిలిన రాజమౌళి, కొత్త హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చారు. 'గ్లోబ్ ట్రోటర్' అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ అప్‌డేట్‌తో పాటు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు రాజమౌళి.

ఈ రేంజ్ సినిమాకు ఏదో ఆశామాషీ ఎనౌన్స్‌మెంట్ సరిపోదు.. అందుకే నవంబర్‌లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. ఆ ఈవెంట్‌లో సినిమా కాస్ట్ అండ్ క్రూను కూడా పరిచయం చేయబోతున్నారు. ఈ అప్‌డేట్‌తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.




