- Telugu News Photo Gallery Cinema photos Sreekaram movie pre release event megastar chiranjeevisharwanand priyanka mohan
Sreekaram Movie : శర్వానంద్ నటనకు ‘శ్రీకారం’ చుట్టిన మెగాస్టార్.. యంగ్ హీరో పై ప్రసంశలు కురిపించి చిరు.
యంగ్ హీరో శర్వానంద్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం శ్రీకారం. వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో శర్వాకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. డి.కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Updated on: Mar 12, 2021 | 12:20 PM

యంగ్ హీరో శర్వానంద్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం శ్రీకారం. వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో శర్వాకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. డి.కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇక శ్రీకారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ శర్వానంద్ పై ప్రశంశల వర్షం కురిపించారు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడని అన్నారు చిరంజీవి.

మొదటిసారి శర్వానంద్ నేను కలిసి ఒక యాడ్ లో చేశామని. ఆసమయంలో నేను అడగ్గానే వెంటనే ఒప్పుకున్నాడని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ టైం స్క్రీన్ పై శర్వా కనిపించింది అప్పుడే అన్నారు చిరు.

అలాగే శంకర్ దాదా సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడగ్గానే వెంటనే చేస్తానంటూ ముందుకు వచ్చాడు. అప్పుడు శర్వాకు మంచి ఫ్యూచరుంటుందని అనిపించిందన్నారు మెగాస్టార్.