- Telugu News Photo Gallery Cinema photos Sobhita Dhulipala Says Rejections About Her Dark Skin telugu movie news
Tollywood: అందంగా లేవు.. చర్మం రంగు బాలేదని ముఖం మీదే విమర్శలు.. హాలీవుడ్లో మెరిసిన తెలుగమ్మాయి..
బంధుప్రీతి గురించి చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. నటిగా ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని అడుగుపెట్టిన కొత్తవారికి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. అందులో శోభితా ధూళిపాళ్ల ఒకరు. మొదట్లో 1000కి పైగా ఆడిషన్స్ ఇచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Updated on: Jun 23, 2024 | 12:20 PM

2013లో మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న తనకు ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదురైనట్లు తెలిపింది. జీవితంలో ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా ఆడిషన్స్ ఇచ్చినట్లు తెలిపింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లోనే ప్రకటనల కోసం చాలా అడియన్స్ చేసానని. సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేసినట్లు తెలిపింది.

కెరీర్ మొదట్లో తన చర్మం రంగు గురించి అవహేలన చేశారని తెలిపింది. నటిగా తాను సరిపోనని.. అందంగా లేనని ముఖం మీదే నేరుగా చెప్పారని.. అందంగా కనిపించని అమ్మాయిని తీసుకుంటే యాడ్స్ ఎలా చూస్తారంటూ మాట్లాడారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకొచ్చింది.

శోభితా ధూళిపాళ్ల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. అలాగే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే మేజర్, గాడ్సే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

మేడ్ ఇన్ హెవన్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అలాగే దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న శోభితా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోయిన్ ప్రశంసలు అందుకుంటుంది.