- Telugu News Photo Gallery Cinema photos Sapthami gowda latest stunning photos goes viral on social media
కాంతార బ్యూటీలో కొత్త కోణం.. ఆ పోటీల్లో ఈ అమ్మడు బంగారు పతకాలను గెలుచుకుందట
2023లో అభిషేక్ అంబరీష్ కథానాయకుడిగా నటించిన ప్రేమ కథాచిత్రం కాళిలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సప్తమి గౌడ. అలాగే ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా ఆమెనటించనుంది.
Updated on: Jun 05, 2024 | 6:48 PM

2023లో అభిషేక్ అంబరీష్ కథానాయకుడిగా నటించిన ప్రేమ కథాచిత్రం కాళిలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సప్తమి గౌడ. అలాగే ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా ఆమెనటించనుంది.

ఐదేళ్ల వయసులో సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ రిషబ్ శెట్టి హీరోగా నటించి , దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ .

రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి నటించింది ఈ వయ్యారి భామ. సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి పాప్‌కార్న్ మంకీ టైగర్ చిత్రంతో తన నటనను ప్రారంభించింది.

ఈ సినిమాకు గాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని కిరాక్ ఫోటోలు షేర్ చేసింది.