Samantha: సమంతకు భూటాన్‌లో ప్రత్యేక వైద్య చికిత్స !!
సమంత షేర్ చేసిన భూటాన్ హాట్ స్టోన్ బాత్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్‌గా వైరల్ అవుతోంది. భూటాన్ ట్రెడిషనల్ డాట్‌షో హాట్ స్టోన్ బాత్ గురించి, దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి షేర్ చేశారు సమంత. భూటాన్‌లో వెకేషన్ గురించి ఫ్యాన్స్ తో పంచుకున్నారు సామ్. మౌంట్ ఎవరెస్ట్ వీడియోలతో పాటు, భూటానీస్ హాట్ స్టోన్ బాత్ గురించి గురించి డీటైల్స్ షేర్ చేశారు. డాట్‌షో చాలా పాపులర్ అని, భూటాన్‌లో ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరిస్తున్నారని అన్నారు సామ్.
Updated on: Nov 08, 2023 | 1:50 PM

దీని గురించి ఓ పోస్టు పెట్టారు సమంత. ''వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్‌లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్ ప్రజలు స్టోన్ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను ఎర్రగా కాలుస్తారు. వాటిని నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్ హాట్ టబ్‌లోకి చేరుతాయి. ఈ ప్రక్రియలో వాడే ఆకులను కెంపా అంటారు. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి'' అంటూ ఆ ప్రాసెస్‌ని వివరించారు సమంత.

మజిల్ పెయిన్, ట్రావెల్ సిక్‌నెస్, మజిల్ - బోన్ రిలేటెడ్ ట్రబుల్స్కీ, ఆర్తిరైటిస్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, స్టొమక్ సిక్‌నెస్ వంటివాటికి అన్నిటికీ ఈ బాత్ ఉపశమనం కలిగిస్తుంది అని చెప్పారు సమంత.

గత కొన్నాళ్లుగా సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నారు. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ఆమెకు మయోసైటిస్ ఉన్న విషయం తెలిసింది. రేర్ ఆటో ఇమ్యూన్ డిసీస్ నుంచి బయటపడటానికి పలు రకాల వైద్యులను సంప్రదిస్తున్నారు సమంత. షూటింగులకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ అప్పుడప్పుడూ నచ్చిన ప్రదేశాలకు ట్రావెల్ చేస్తున్నారు.

ఆమె నటించిన ఖుషి ఇటీవల విడుదలైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.సమంత కీ రోల్ చేసిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. వరుణ్ ధావన్‌తో కలిసి నటించారు సమంత. రాజ్, డీకే దర్శకత్వం వహించారు. చెన్నై స్టోరీస్ అనే సినిమాతో సమంత హాలీవుడ్ డెబ్యూ ఇస్తారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంగ్లిష్, తమిళ్‌లో ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.