షారుక్ ఖాన్‌కు ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. ఎంతలా అంటే.. మిగిలిన హీరోలంతా ఒకెత్తు అయితే కింగ్ ఖాన్ మాత్రమే మరో ఎత్తు. ప్రేక్షకులు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. మొన్న విడుదలైన సల్మాన్ టైగర్ 3 సినిమాకు 300 కోట్లు కూడా రాలేదు.. కానీ పఠాన్, జవాన్ మాత్రం 1000 కోట్లు వసూలు చేసాయి. దాన్నిబట్టి షారుక్ డామినేషన్ అర్థం చేసుకోవచ్చు.