- Telugu News Photo Gallery Cinema photos Rumours about Samantha Ruth Prabhu in a Relationship with Raj Nidimoru
Samantha: సమంత రిలేషన్ షిప్ స్టేటస్ మారిందా.. నెట్టింట హాట్ టాపిక్
కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత పేరు తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ టాపిక్ సామ్ సినిమాల గురించి కాదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి. ప్రజెంట్ సింగిల్ స్టేటస్‌లో ఉన్న సామ్, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే హావ్ ఏ లుక్ ఆన్ దిస్ స్టోరీ.
Updated on: May 17, 2025 | 3:33 PM

కొద్ది రోజులుగా సమంత ఎక్కడ కనిపించినా దర్శకుడు రాజ్ నిడమోరు కూడా ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా మారి శుభం సినిమా తెరకెక్కిచటం మొదలు పెట్టిన తరువాత ఇద్దరు రెగ్యులర్‌గా కెమెరాల కంటపడుతున్నారు.

దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ వార్తలపై సామ్ - రాజ్ స్పందించకపోవటంతో నిజమేనేమో అన్న కంక్లూజన్‌కు వచ్చేస్తున్నారు ఫ్యాన్స్.

సమంత కీలక పాత్రలో నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్‌లకు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజ్. శుభం సినిమా నిర్మాణం విషయంలో సమంతకు ఆయన సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆ తరువాత ప్రమోషన్స్‌లోనూ ఆమెతోనే కలిసి ఉన్నారు.

ఆ పరిచయమే ఇప్పుడు ప్రేమగా మారిందన్నది ఆన్‌లైన్ ఆడియన్స్ చేస్తున్న కామెంట్. తాజాగా రాజ్ భార్య శ్యామల చేసిన పోస్ట్ రిలేషన్‌షిప్ వార్తలకు మరింత బలాన్నిచ్చింది.

తన ఇన్‌స్టా స్టోరీలో 'నా గురంచి ఆలోచిస్తున్న వాళ్లకు, వింటున్న వాళ్లకు, నా కోసం మాట్లాడుతున్న వాళ్లకు నా కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేయటంతో... ఇది రాజ్ - సమంత రిలేషన్ గురించే అని ఫిక్స్ అవుతున్నారు నెటిజెన్స్. మరి ఇప్పటికైనా సామ్ సైడ్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి.




