Kantara 2: షూటింగ్ లేట్ అవుతున్నా.. బడ్జెట్ అదుపు తప్పుతున్నా.. తగ్గేదేలే అంటున్న కాంతార టీమ్
అనుకున్న దానికంటే ఆలస్యమైంతే నిర్మాతల్లో కంగారు కామన్. కానీ కాంతార 2 విషయంలో అదేం కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు. షూటింగ్ లేట్ అవుతున్నా.. బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో మాత్రం ఏ టెన్షన్ కనిపించట్లేదు..? ఇంతకీ సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు..? అనుకున్న టైమ్‌కు సినిమా వస్తుందా..?
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Apr 04, 2025 | 1:05 PM

జైలర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది.. వర్త్ వర్మ వర్త్ అని..! ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నపుడు అది వర్త్ అనిపిస్తే.. ఎదురు చూపులన్నీ మరిచిపోతుంటారు. కాంతార 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి.

మూడేళ్ళ కింద కాంతార సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం.. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కర్ణాటకలోని భూత కోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది. 'కాంతార-2'ను కూడా అప్పుడే అనౌన్స్ చేసారు మేకర్స్.

కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైమ్ తీసుకున్నారు రిషబ్. 2024 ఎప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్. 200 కోట్లతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కుతుంది.

కాంతార కథకి చాలా చరిత్ర ఉందని.. అసలు కథ అంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది.. పార్ట్ 2లో వాటి మూలాలు చూపించబోతున్నారు రిషబ్ శెట్టి.

అక్టోబర్ 2, 2025న కచ్చితంగా సినిమా వస్తుందని.. ఈసారి వాయిదాలేం లేవని చెప్తున్నారు మేకర్స్. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, ఇంగ్లీష్‌లోనూ కాంతారా 2 విడుదల కానుంది.





























