Rashmika Mandanna: నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ అంటున్న నేషనల్ క్రష్
ఇండిపెండెన్స్ డే వీక్‌లో తమన్నా భాటియా చేసిన ఓ విషయాన్ని డిసెంబర్ 6న రష్మిక మందన్న రిపీట్ చేయబోతున్నారా? తమన్నా ఒక్క సినిమా విషయంలో సక్సెస్ అయితే, తాను రెండు సినిమాలతోనూ విజయాన్ని మూటగట్టుకోవాలనుకుంటున్నారా? తనకు తానే పోటీ అని మాటల్లో చెప్పుకోవడం వేరు... నిజ జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎమోషనల్‌గా బ్యాలన్స్ చేసుకోవడం వేరు... ఎలా బ్యాలన్స్ చేస్తానా? అనే ఆలోచనల్లోనే ఉన్నారా నేషనల్ క్రష్.. మాట్లాడుకుందాం రండి...
Updated on: Aug 21, 2024 | 1:06 PM

నార్త్ లో యానిమల్‌తో ప్రూవ్ చేసుకున్నారు రష్మిక మందన్న. డిసెంబర్‌లో చావా ఎలాగూ రిలీజ్‌కి రెడీ అవుతోంది. సౌత్, నార్త్ ని నాజూగ్గా బ్యాలన్స్ చేస్తున్నారు మన నేషనల్ క్రష్ అని అభిమానంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా చావా. ఇందులో శంభాజీ పాత్ర ఏసుబాయి కేరక్టర్‌లో నటిస్తున్నారు రష్మిక మందన్న. డిసెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది చావా మూవీ. హిస్టారికల్ సినిమా కావడంతో సౌత్‌లోనూ ఈ సినిమా పట్ల ఆసక్తి మెండుగా కనిపిస్తోంది.

అటు పుష్పరాజ్‌కి నచ్చిన శ్రీవల్లిగానూ సేమ్ డేట్‌లోనే ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు నటి రష్మిక మందన్న. పుష్ప సినిమాకు సీక్వెల్ పుష్ప2 డిసెంబర్ 6న విడుదల కానుంది.

ఆల్రెడీ విడుదలైన సూసేకీ పాటలో అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ ఓహో అనిపిస్తోంది. లిరికల్ వీడియోలో మీరు చూసినదానికి వెయ్యింతలు ఒరిజినల్ సాంగ్‌లో చూడటానికి సిద్ధంగా ఉండమని ఊరిస్తున్నారు మేకర్స్. సో డిసెంబర్ లో పండగ చేసుకోవడానికి మీరందరూ రెడీ అయిపోండని అభిమానులకు గట్టిగానే చెబుతున్నారు రష్మిక మందన్న.