- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna Shares Interesting Post Amid Engagement Rumours With Vijay Deverakonda
Vijay Deverakonda- Rashmika: విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక తొలి పోస్ట్.. ఏం షేర్ చేసిందో తెలుసా?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవకొండ, రష్మిక మందన్నాలు సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న వార్తలు తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరి పేర్లు తెగ మార్మోగిపోతున్నాయి. అయితే విజయ్ తో ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
Updated on: Oct 04, 2025 | 11:00 PM

1. హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లు నిశ్చితార్థం చేసుకున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 03) ఉదయంవిజయదేవరకొండ ఇంట్లో ఈ శుభాకార్యం జరిగిందని ప్రచారం జరుగుతోంది

2. అయితే అత్యంత గోప్యంగా ఈ ఎంగజ్మెంట్ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో విజయ్-రష్మికల ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

3. ఇదే వేడుకలో విజయ్- రష్మికల పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రేమ పక్షుల పెళ్లి జరగనుందని సమచా

4. చాలా మంది సెలబ్రిటీ ల్లాగే వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే విజయ్-రష్మికల ఎంగేజ్మెంట్ పై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

5. మరోవైపు విజయ్ తో ఎంగేజ్మెంట్ వార్తల నేపథ్యంలో రష్మిక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. 'నాకు తెలుగు మీరంతా దీని కోసమే ఎదురు చూస్తున్నారు' అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.

అయితే రష్మిక తన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడు చెబుతారని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.




