విదేశాల్లో మహారాణి.. రష్మిక లుక్‌కు ఫిదా అవ్వాల్సిందే!
అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ చిన్నది విదేశీ వీధుల్లో మహారాణి లుక్‌లో ప్రిన్సెస్‌లా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Sep 12, 2025 | 1:29 PM

బ్యూటీ రష్మిక మందన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. వరస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని, పాన్ ఇండియా బ్యూటీగా సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది.

ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, గీతా గోవిందం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మూవీ తర్వాత రష్మికకు ఊహించనన్ని ఆఫర్స్ వచ్చాయి. వరసగా సినిమాలు చేస్తూ , టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చాటింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటింది. తర్వాత పుష్ప2, యానిమల్, కుభేర, ఛావా సికిందర్ వంటి సినిమాలతో వరస హిట్స్ అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. సికిందర్ ఊహించిన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఈ బ్యూటీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఫారెన్ వీధుల్లో చక్కెర్లు కొట్టింది. రెడ్ కలర్ అవుట్ ఫిట్‌లో మహారాణిలా కనిపిస్తూ పలు ఫొటోలకు ఫోజులివ్వగా, బ్లాక్ కలర్ డ్రెండీ డ్రెస్‌లో బ్యూటి ఫుల్ లుక్‌లో కనిపించింది. బ్లాక్ డ్రెస్‌లో తన గ్లామర్‌తో మతిపొగొట్టింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, క్యూట్ , బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి.



