Ramcharan: ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న రామ్ చరణ్ లైనప్
రామ్‌చరణ్ లైనప్ మీద ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది. లైనప్ మీద ఎంత ఇంట్రస్ట్ ఉందో, చేస్తున్న సినిమాల మీద, వాటి కథల మీద కూడా అదే తరహా ఇంట్రస్ట్ కనిపిస్తోంది. ఇప్పుడు శిష్యుడు.. ఆ తర్వాత గురువు.. చెర్రీకి ఎలాంటి కథలు సిద్ధం చేశారో ఓసారి మాట్లాడుదాం వచ్చేయండి.. పెద్ది సినిమా గ్లింప్స్ చూడక ముందు వరకూ అందరూ.. ఈ మూవీని రంగస్థలానికి సీక్వెలో, ప్రీక్వెలో.. సేమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీనో అనుకున్నారు.
Updated on: Sep 01, 2025 | 11:18 PM

పెద్ది సినిమా గ్లింప్స్ చూడక ముందు వరకూ అందరూ.. ఈ మూవీని రంగస్థలానికి సీక్వెలో, ప్రీక్వెలో.. సేమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీనో అనుకున్నారు. కానీ, గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా సీనూ, సిట్చువేషన్ వేరని ఫిక్సయిపోయారు.

పెద్ది సెట్స్ మీద ఉన్నప్పుడే రంగస్థలానికి పర్ఫెక్ట్ సీక్వెల్‌ని.. సుకుమార్ సెట్ చేస్తున్నారనే మాటలు వినిపించాయి. సుకు డైరక్ట్ చేయబోయేది చిట్టిబాబు నెక్స్ట్ వెర్షనే అనే టాక్ స్పీడ్‌గా స్ప్రెడ్ అయింది. కానీ, ఇప్పుడు ఇందులోనూ డివైడ్ టాక్ వినిపిస్తోంది

రామ్‌చరణ్‌తో పర్ఫెక్ట్ లవ్ స్టోరీని తెరకెక్కించాలనుకున్నారట సుకుమార్. కానీ, పుష్ప లాంటి హ్యుమాంగస్ హిట్ తర్వాత తన నుంచి యాక్షన్ మూవీనే కోరుకుంటారని భావించారట.

పెద్ది తర్వాత వస్తున్న సినిమా కావడంతో, లవర్ బోయ్ ఇమేజ్.. చెర్రీకి ఆ టైమ్‌కి సూట్ కాదనుకున్నారట. అందుకే పక్కా యాక్షన్ కథకి ఫిక్సయ్యారట.ఈ ఏడాది గేమ్ చేంజర్ చెర్రీకి కలిసిరాలేదు. వచ్చే ఏడాది పెద్ది, ఆ తర్వాత సుకుమార్ సినిమా మీదే హోప్స్ అన్నీ అని అంటున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం పెద్ది సాంగ్ షూట్‌లో మైసూర్‌లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. గేమ్‌చేంజర్‌తో డీలా పడిన ఫ్యాన్స్ లో మళ్లీ ఊపు తీసుకురావాలన్న ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు చెర్రీ.




