- Telugu News Photo Gallery Cinema photos Public Response on Vijay Thalapathy Tamilaga Vetri Kazhagam Public meeting in Tamilnadu
Vijay Thalapathy: స్టార్ ల రియాక్షనే కాదు.. పబ్లిక్ రియాక్షన్ కూడా ముఖ్యంమే.! విజయ్ పార్టీపై..
దళపతి విజయ్ ప్లానింగ్ మారిపోయిందా..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే రాజకీయాల్లోకి బిజీ అవుతాడని అభిమానులు అనుకున్నా.. ఉన్నట్లుండి తన ప్లానింగ్ మార్చేసుకున్నారా..? ఇకపై ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు కలిపి బ్యాలెన్స్ చేయబోతున్నారా..? విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహమేంటి..? సినిమాలు చేస్తారా చేయరా.?
Updated on: Nov 03, 2024 | 6:08 PM

దళపతి విజయ్ ప్లానింగ్ మారిపోయిందా..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే రాజకీయాల్లోకి బిజీ అవుతాడని అభిమానులు అనుకున్నా.. ఉన్నట్లుండి తన ప్లానింగ్ మార్చేసుకున్నారా..?

ఇకపై ఇటు సినిమాలు.. అటు రాజకీయాలు కలిపి బ్యాలెన్స్ చేయబోతున్నారా..? విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహమేంటి..? సినిమాలు చేస్తారా చేయరా.? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 8 నెలలు దాటిపోయింది.

ఎప్పట్నుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ.. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి వస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు విజయ్.

తాజాగా ఆయన మొదటి రాజకీయ సభ భారీగా జరిగింది. తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకు ముడి పెడుతుంటారు.. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటి ఉంటుందా..! ఇప్పుడిదే జరిగింది.

తొలి రాజకీయ సభ ఇలా చెప్పారో లేదో.. అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు విజయ్. తమిళనాట ఒకే కుటుంబం అవినీతి పాలన చేస్తుందంటూ విరుచుకుపడ్డారు దళపతి. డబ్బు తీసుకుని ఓటేసే రాజకీయం పోవాలి.. సమానత్వం రావాలంటూ తన నినాదం బలంగా చెప్పుకొచ్చారు విజయ్.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కరోజులో అయింది కాదు.. చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. ఇప్పుడిక నేరుగా రాజకీయ రణక్షేత్రంలో అడుగు పెట్టారు. రాజకీయాల కోసమే ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు విజయ్.

అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయినా దళపతి 69 రీమేక్ అన్న వార్తలపై చిత్రయూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.





























