- Telugu News Photo Gallery Cinema photos Producers say take it easy for Sankranti movies by reminiscing past memories
Sankranti Movies: గత జ్ఞాపకాలను తలుచుకుని సంక్రాంతి సినిమాల విషయంలో టేక్ ఇట్ ఈజీ అంటున్న నిర్మాతలు..
సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు రావడం బయ్యర్లకు భయం పుట్టించే విషయమే.. నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న విషయమే. కానీ గత జ్ఞాపకాలను తలుచుకుని హాయిగా పడుకుంటున్నారు వాళ్లు. మరీ 5 సినిమాలు కాదు కానీ 4 సినిమాలు వచ్చి అందులో 3 విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గత సంక్రాంతులు ఈ పండగను ఎలా మోటివేట్ చేస్తున్నాయి..?
Praveen Vadla | Edited By: Janardhan Veluru
Updated on: Jan 06, 2024 | 4:42 PM

సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు రావడం బయ్యర్లకు భయం పుట్టించే విషయమే.. నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న విషయమే. కానీ గత జ్ఞాపకాలను తలుచుకుని హాయిగా పడుకుంటున్నారు వాళ్లు. మరీ 5 సినిమాలు కాదు కానీ 4 సినిమాలు వచ్చి అందులో 3 విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గత సంక్రాంతులు ఈ పండగను ఎలా మోటివేట్ చేస్తున్నాయి..?

ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి ఫోకస్ సంక్రాంతి సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా గుంటూరు కారం ఒక్కటే 150 కోట్ల బిజినెస్ చేస్తుంటే.. మిగిలిన నాలుగు సినిమాలు కలిపి 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకేసారి అన్ని సినిమాలు వస్తే థియేటర్స్ సరిపోతాయా అనే అనుమానాలున్నాయి. కానీ అన్నీ ఒకేసారి వచ్చినా విజయం సాధిస్తాయనే నమ్మకం గత సంక్రాంతులు చూపించాయి.

ఎక్కడి వరకో ఎందుకు.. గత సంక్రాంతినే తీసుకుంటే వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలు వచ్చాయి. ఈ మూడూ విజయం సాధించాయి. చిరు సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే.. బాలయ్య 130.. విజయ్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేసారు. దానికి ముందు 2017లోనూ ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు పండక్కి మంచి విజయం సాధించాయి.

ఖైదీ నెం 150, శాతకర్ణి మధ్యలో వచ్చి శతమానం భవతి కూడా బ్లాక్‌బస్టర్ అయింది. 2016లోనూ ఇలాంటి సీనే జరిగింది. ఆ పండక్కి సోగ్గాడే చిన్నినాయనా, నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు హిట్ అయ్యాయి. డిక్టేటర్ కూడా ఓ మాదిరి కలెక్షన్లు తీసుకొచ్చింది. 2020లోనూ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు వచ్చి సంచలన విజయాలు అందుకున్నాయి.

2016, 2017, 2020, 2023 సంక్రాంతులు తీసుకొచ్చిన విజయాలే 2024లోనూ కంటిన్యూ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. పండక్కి 5 సినిమాలు వచ్చినా.. ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధమే అని.. కంటెంట్ బాగున్నపుడు ఎన్నైనా హిట్ అవుతాయంటున్నారు మేకర్స్. మరి గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్‌లలో ఆ కంటెంట్ ఏ సినిమాలో ఉందో చూడాలిక. అయితే తాజాగా రద్దీ కారణంగా ఈ బరిలో నుంచి రవితేజ ఈగల్ తప్పుకొని ఫిబ్రవరి 9కి పోస్టుపోన్ అయింది.





























