- Telugu News Photo Gallery Cinema photos Nandamuri heroes NTR, Balakrishna, Kalyan Ram are stepping towards sequel movies
Nandamuri Heroes: సీక్వెల్స్ వైపు నందమూరి హీరోల అడుగులు.. ఎవరు దారెటు వెళ్తుందంటే..
నందమూరి హీరోలు నియర్ ఫ్యూచర్‌లో సీక్వెల్స్ కి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ దేవర పార్ట్ ఒన్ ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. బింబిసార సీక్వెల్ కోసం కల్యాణ్‌రామ్ సిద్ధమవుతున్నారు. మిగిలిన సినిమాల సంగతేంటి? అని అనుకుంటున్నారా? కమాన్ లెట్స్ వాచ్... నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన సినిమా డెవిల్. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. బాలయ్య బోయపాటి సీక్వెల్
Updated on: Jan 06, 2024 | 3:39 PM

నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన సినిమా డెవిల్. ఈ సినిమా డిసెంబర్ విడుదలైంది. మంచి స్పందన వస్తోంది. పీరియాడిక్ ఏజెంట్ డ్రామాగా ప్రూవ్ చేసుకుంటోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక డెవిల్2 చేయడం పక్కా అని అన్నారు కల్యాణ్‌రామ్.

ఆల్రెడీ కారైకుడిలో షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించామని, 1940స్ కథతో పాటు, ఇప్పటి జనరేషన్‌కి కూడా లింక్ చేస్తూ స్క్రీన్‌ప్లే సాగుతుందని అన్నారు కల్యాణ్‌రామ్.

2024లోగానీ, 2025లోగానీ డెవిల్ సీక్వెల్ రెడీ అవుతుందని అన్నారు కల్యాణ్‌రామ్. ఈ మధ్య సడన్ సక్సెస్ అందుకున్న బింబిసారకు కూడా సీక్వెల్ చేయబోతున్నారు. 2024లో బింబిసార సినిమా సీక్వెల్ స్టార్ట్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు నందమూరి హీరో.

నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా దేవర. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలవుతుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి సీక్వెల్ పనులు మొదలుపెడతారు కొరటాల శివ.

దేవరకు మాత్రమే కాదు, ట్రిపుల్ ఆర్‌కి కూడా సీక్వెల్ ఉందనే వార్తలు ఎప్పటి నుంచో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు అఖండ సీక్వెల్ కూడా ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్.




