Priyanka Mohan: బార్బీ లుక్ లో అదరగొట్టిన ప్రియాంక మోహన్.. ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించింది. నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’తో పాటు, శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయాయి. అయినా ప్రియాంక మాత్రం తన ప్రయత్నాల్ని ఆపలేదు. 1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది. అంతేకాదు అక్కడే ఉన్న పెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (PESIT)లో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసింది.
Phani CH |
Updated on: Aug 15, 2023 | 6:46 PM

తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు రెండు సినిమాల్లో నటించింది. నాని సరసన ‘గ్యాంగ్ లీడర్’తో పాటు, శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టకోలేకపోయాయి. అయినా ప్రియాంక మాత్రం తన ప్రయత్నాల్ని ఆపలేదు.

1994 నవంబర్ 20న జన్మించిన ఈ భామ కన్నడ తల్లికి తమిళ తండ్రికి తమిళనాడులోని మద్రాసులో పుట్టి పెరిగింది. అంతేకాదు అక్కడే ఉన్న పెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (PESIT)లో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్‌లో డిగ్రీని పూర్తి చేసింది.

ఇక ప్రియాంక అరుల్ మోహన్ విషయానికొస్తే.. సినిమా పరిశ్రమలో కష్టమొకటో సరిపోదు. అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక హీరోయిన్స్ విషయంలో ఇదే విషయాన్ని అన్వయించాలంటే.. గ్లామర్ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు.

అటు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తూనే.. తనవంతుగా ప్రయత్నం చేస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది.

వరుసగా తన గురించిన పోస్టులు పెడుతూ వస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్టలో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. తమిళ బ్యూటీ ఇచ్చిన ఫొజులకు ఫ్యాన్స తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ తో వైరల్ చేస్తున్నారు.

ప్రియాంక మోహన్ స్టార్ హీరోల సరసన నటించినా పెద్దగా హిట్స్ దక్కించుకోలేకపోయింది. ఆమె నటించిన సినిమాల్లో ‘డాన్’ మూవీ కాస్తా అలరించింది. ఇక తర్వాత పెద్దగా సక్సెస్ లేదనే చెప్పాలి.

ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’లో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాత్రం ప్రియాంక క్రేజ్ పెరుగనుందని అర్థమవుతుందోని భావిస్తున్నారు.





























