ఓవర్ నైట్ లో స్టార్ అయిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తేజ సజ్జకి జోడిగా ఇష్క్ సినిమాలో నటించింది ఈ భామ. కానీ ఊహించిన స్థాయిలో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయితే సోషల్ మీడియాలో తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.