- Telugu News Photo Gallery Cinema photos Prabhas upcoming film Kalki 2898 AD video leaked team in panic after that
Kalki 2898 AD: ప్రభాస్ సినిమాకు లీకుల లొల్లి.. కల్కి నుండి ఆ వీడియో బయటకి రావడం తో టీమ్ లో టెన్షన్
ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇప్పుడిలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా ప్రాజెక్ట్ K లీక్ విషయంలో ఇలాంటి సంచలనాలే బయటికి వస్తున్నాయి. అసలు ఈ లీక్స్ గొడవేంటి..? ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఈ రోజుల్లో సినిమాలు తీయడం కాదు.. తీసిన సినిమాలు రిలీజ్ వరకు దాచుకోవడమే కష్టమైపోతుంది.
Updated on: Sep 07, 2023 | 2:30 PM

ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇప్పుడిలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా ప్రాజెక్ట్ K లీక్ విషయంలో ఇలాంటి సంచలనాలే బయటికి వస్తున్నాయి. అసలు ఈ లీక్స్ గొడవేంటి..? ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

ఈ రోజుల్లో సినిమాలు తీయడం కాదు.. తీసిన సినిమాలు రిలీజ్ వరకు దాచుకోవడమే కష్టమైపోతుంది. తాజాగా ప్రాజెక్ట్ కేలో ఓ వీడియో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. షూటింగ్ మొదలైన రెండేళ్లలో ఫస్ట్ టైమ్ ఈ చిత్రం నుంచి ఓ లీక్ బయటికొచ్చింది. ఈ విషయంపై చిత్రయూనిట్ సీరియస్‌గానే ఉన్నారు. సినిమాకు పని చేస్తున్న ఓ CG కంపెనీ నుంచే ఇది లీకైనట్లు తెలుస్తుంది.

ప్రభాస్ సినిమాలకు ఈ లీక్ ఇష్యూ ఇదే తొలిసారి కాదు. గతంలోనూ సాహోలో ఇంట్రడక్షన్ సీన్ ఇలాగే లీక్ చేసారు. దానికి ముందు బాహుబలి 2లోని ఫైట్ సీన్ అంతా ముందే బయటికి వచ్చింది. అది కూడా ఇంటి దొంగల పనే. గ్రాఫిక్ డిజైనర్స్‌లో ఒకరు ఫుటేజ్ లీక్ చేసారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. మొన్నటికి మొన్న పుష్ప 2లో లారీల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వీడియో లీక్ అయింది.

అప్పట్లో పుష్పకు కూడా లీకుల బెడద తప్పలేదు. సినిమాలోని ఓ ఫైట్ సీన్ ముందే బయటికొచ్చింది. దానిపై యూనిట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. సంక్రాంతికి విడుదలైన బాలయ్య వీరసింహారెడ్డిలోని ఫైట్ సీన్ ముందే నెట్‌లో దర్శనమిచ్చింది. అలాగే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాల్లోని కొన్ని సీన్స్ రిలీజ్‌కు ముందే బయటికొచ్చాయి.

ఈ లీకేజీల సమస్య ఇప్పటిది కాదు.. పదేళ్ళ కింద అత్తారింటికి దారేది అయితే ఏకంగా ఫస్టాఫ్ అంతా విడుదలకు ముందే లీక్ అయిపోయింది. అప్పట్లో అది పెద్ద సంచలనమే. ఇది కావాలనే కొందరు చేసారని పవన్ కూడా చెప్పారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లీకు వీరులు మాత్రం ఆగట్లేదు. అందులో ఇంటి దొంగలే ఎక్కువగా ఉండటం కంగారు పుట్టించే విషయం.




