సాధారణంగా శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు క్యూ కడుతుంటాయి.. కానీ ఈసారి మాత్రం గురువారమే థియేటర్స్ మోతెక్కిపోనున్నాయి. పైగా వచ్చేవి రెండూ క్రేజీ సినిమాలే.. అందులో ఒక దానిపై ఏకంగా 1000 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలున్నాయి. పఠాన్ తర్వాత షారుక్.. ఐదేళ్ళ తర్వాత అనుష్క ఈ వారమే వచ్చేస్తున్నాయి. మరి ఈ క్లాస్ వర్సెస్ మాస్ పోరు ఎలా ఉండబోతుంది..?