- Telugu News Photo Gallery Cinema photos Our star heroes taking peak summer lite and focusing on after summer
After Summer Films: పీక్ సమ్మర్‌ను లైట్.. ఆఫ్టర్ సమ్మర్‌పై మన స్టార్ హీరోల ఫోకస్..
మామూలుగా అయితే సమ్మర్ సీజన్ అంటేనే వరసగా సినిమాలు వస్తుంటాయి. కానీ కరోనా తర్వాత ఎందుకో మరి మన దర్శక నిర్మాతలు సమ్మర్‌పై పెద్దగా ఫోకస్ చేయట్లేదు. పెద్ద హీరోలు కూడా సమ్మర్‌ను వదిలేస్తున్నారు. అదేంటో విచిత్రంగా సమ్మర్ తర్వాత అంతా సమరానికి సై అంటున్నారు. మరి పీక్ సమ్మర్ వదిలేసి.. వీక్ సమ్మర్‌పై ఫోకస్ చేస్తున్న వాళ్లెవరు..?
Updated on: May 20, 2025 | 2:02 PM

సమ్మర్‌లో పిల్లలకు హాలీడేస్ ఉంటాయి.. ఏ ఎగ్జామ్స్ గోల ఉండదు అయినా కూడా పీక్ సమ్మర్‌ను వదిలేస్తున్నారు మన హీరోలు. ఇంకా మాట్లాడితే.. ఎండలు తగ్గాకే అసలు సినిమా సీజన్ మొదలవుతుంది. ఈ లిస్టులో రాబోతున్న తొలి పెద్ద సినిమా హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. పాజిటివ్ టాక్ గానీ వచ్చిందంటే జూన్ అంతా హరిహర వీరమల్లు హవానే కనిపిస్తుంది.

హరిహర వీరమల్లు వచ్చిన వారానికే జూన్ 20న కుబేరాతో ధనుష్ రానున్నారు. అప్పుడెప్పుడో కరోనా టైమ్‌లో లవ్ స్టోరీ సినిమాతో వచ్చిన శేఖర్ కమ్ముల.. మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని కుబేరా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమాగా వస్తున్న కుబేరాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక జూన్ 27న కన్నప్పతో రానున్నారు మంచు విష్ణు. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ హీరో. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది టీం. పైగా ప్రభాస్ ఉన్నారు కాబట్టి అంచనాలు బానే ఉన్నాయి.

జులైలో సినీ సీజన్ మొదలుపెట్టబోయేది విజయ్ దేవరకొండ. జులై 4న ఈయన నటిస్తున్న కింగ్ డమ్ విడుదల కానుంది. నిజానికి మే 30నే రావాల్సిన ఈ చిత్రాన్ని.. దేశంలోని పరిస్థితుల కారణంగా వాయిదా వేసారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్ డమ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు సూర్యదేవర నాగవంశీ.

అన్నీ కుదిర్తే చిరంజీవి విశ్వంభర సైతం జులైలోనే విడుదల కానుంది. ఇంద్ర వచ్చిన జులై 24నే విశ్వంభరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో బిజినెస్ రేంజ్ 140 కోట్ల వరకు జరుగుతుంది. మొత్తానికి సినీ సీజన్ అంతా సమ్మర్ తర్వాతే కనిపిస్తుంది.




