Bollywood Villians: తెలుగులో విల్లన్స్ గా బాలీవుడ్ నటులు.. నిర్మాతలకు తడిసి మోపెడు..

బాలీవుడ్ నటుల వల్ల మన సినిమాలకు ఎంత హెల్ప్ అవుతుందో తెలియదు కానీ నిర్మాతలకు మాత్రం తడిసి మోపెడవుతుంది. అవును.. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా ఇదే నిజం. నార్త్ నటులు సౌత్‌పై బానే ఫోకస్ చేసారు. కానీ వాళ్లని భరించడమే కష్టంగా మారిందిప్పుడు. ముఖ్యంగా విలన్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ నుంచే దిగుమతి అవుతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Mar 23, 2024 | 10:20 AM

బాలీవుడ్ నటులు.. భారీ రేట్లు.. టాలీవుడ్‌కు ఈ లైన్ ఇప్పుడు బాగా సెట్ అవుతుంది. ముఖ్యంగా విలన్స్ కోసం హిందీ ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నారు మన దర్శకులు. తాజాగా రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నారు.

1 / 5
కేజియఫ్ 2 నుంచి ఈయన సౌత్ జర్నీ మొదలైంది. ప్రభాస్ రాజా సాబ్‌, పూరీ డబుల్ ఇస్మార్ట్‌లోనూ నటిస్తున్నారు సంజయ్. డబుల్ ఇస్మార్ట్‌ కోసం సంజయ్‌కు 10 కోట్లకు పైగానే పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు RC16 కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నారు ఖల్ నాయక్.

2 / 5
ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా అంతే. ఈయన బాలీవుడ్‌లో హీరోగా ఏ రేంజ్‌లో తీసుకుంటారో తెలియదు కానీ మన దగ్గర దేవర కోసం ఆస్తులు రాయించుకుంటున్నారు. ఆదిపురుష్‌లోనూ విలన్‌గా నటించారు సైఫ్. ఇప్పుడు దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్.

3 / 5
బాలీవుడ్‌లో ఔట్ డేటెడ్ అయిన అర్జున్ రాంపాల్ బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినెమలి విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ పాత్ర చేయడం  కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారు అర్జున్.

4 / 5
ఇక యానిమల్‌తో బాబీ డియోల్ రేంజ్ పెరిగింది. ప్రస్తుతం NBK 109, హరిహర వీరమల్లు, కంగువాలో నటిస్తూ సౌత్ మోస్ట్ వాంటెడ్ విలన్ అయ్యారు బాబీ. అలాగే గూడఛారి 2, ఓజితో ఇమ్రాన్ హష్మీ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లంతా తెలుగులో నటించడానికి బాలీవుడ్ కంటే భారీగా తీసుకుంటున్నారు.

5 / 5
Follow us