- Telugu News Photo Gallery Cinema photos Did the movies that came out this week please the audience and will increase the buzz in theaters ?
Movie Updates: ఈ వారం వచ్చిన సినిమాలేంటి..? ఈ ఫ్రైడే సినిమాలపై టాక్ ఏంటి.?
సంక్రాంతి తర్వాత సౌండింగ్ తగ్గిపోయింది.. పేరున్న సినిమాలేవీ రావట్లేదు.. వచ్చిన సినిమాలేవీ ఆడట్లేదు. ఈ క్రమంలోనే మరోవారం బాక్సాఫీస్ దగ్గర భారంగా గడిచిపోయింది. మరి ఈ వారం వచ్చిన సినిమాలేంటి..? ఈ ఫ్రైడే అయినా థియేటర్స్‌కు ఆడియన్స్‌ను రప్పించే సినిమాలున్నాయా..? సంక్రాంతి తర్వాత సౌండింగ్ తగ్గిపోయింది.. పేరున్న సినిమాలేవీ రావట్లేదు.. వచ్చిన సినిమాలేవీ ఆడట్లేదు. ఇవన్నీ రిలీజ్ స్టోరీలో చూద్దాం..
Updated on: Mar 23, 2024 | 10:00 AM

సంక్రాంతి తర్వాత సౌండింగ్ తగ్గిపోయింది.. పేరున్న సినిమాలేవీ రావట్లేదు.. వచ్చిన సినిమాలేవీ ఆడట్లేదు. ఈ క్రమంలోనే మరోవారం బాక్సాఫీస్ దగ్గర భారంగా గడిచిపోయింది. మరి ఈ వారం రాబోతున్న సినిమాలేంటి..? ఈ ఫ్రైడే అయినా థియేటర్స్‌కు ఆడియన్స్‌ను రప్పించే సినిమాలున్నాయా..? ఇవన్నీ రిలీజ్ స్టోరీలో చూద్దాం..

ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి కానీ బాక్సాఫీస్ దగ్గర సందడి మాత్రం కనిపించడం లేదు. మార్చిలో భీమా, గామి, ఆపరేషన్ వాలంటైన్ లాంటి క్రేజీ సినిమాలు వచ్చినా.. ఏ ఒక్కటి బ్లాక్‌బస్టర్ కాలేదు. ఈ వారం శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ విడుదలైంది.

శ్రీ విష్ణు ముందు సినిమా సామజవరగమన బ్లాక్‌బస్టర్ కావడంతో దీనిపై ఆసక్తి బాగా వచ్చింది. ఈ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సామజవరగమనతో శ్రీ విష్ణు మార్కెట్ బాగానే పెరిగింది. అదిప్పుడు ఓం భీమ్ బుష్‌కు హెల్ప్ అవుతుందని భావించారు మేకర్స్. పైగా ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండస్ట్రీకి పూర్తిగా డ్రై పీరియడ్ నడుస్తుంది. మరోవైపు మార్చి 22న లైన్ మ్యాన్ సినిమా కూడా విడుదలైంది. త్రిగుణ్ ఇందులో హీరో. ఈ రెండు సినిమాలే ఈ వారం వస్తున్నాయి. వీటిలో పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అందరి ఫోకస్ ఓం భీమ్ బుష్‌పైనే ఉన్నాయి.

అయితే ఈ వారం సినిమాలకు ఐపిఎల్ గండం కూడా ఉంది. మార్చి 29 నుంచి మళ్లీ బాక్సాఫీస్‌కు మంచి రోజులు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే ఆ రోజు టిల్లు స్క్వేర్.. ఆ తర్వాత వారం ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రానున్నాయి. వీటితోనే సమ్మర్ ఫ్యూచర్ తేలనుంది.




