- Telugu News Photo Gallery Cinema photos No updates from Director Shankar for Ram Charan Game Changer movie as he is busy with Indian 2
Game Changer: ‘ఇండియన్ 2’ ఆన్ ట్రాక్.. ‘గేమ్ ఛేంజర్’ ఆఫ్ ట్రాక్.. వర్రీలో చరణ్ ఫ్యాన్స్..
ఒకేసారి రెండు సినిమాలతో ట్రావెల్ చేస్తున్నశంకర్ ఇప్పుడు ఓ హీరోను ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ 2 ఆగిపోవటంతో గేమ్ చేంజర్‌ను స్టార్ట్ చేసిన దర్శకుడు, కమల్ లైన్‌లోకి రావటంతో చరణ్‌ను లైట్ తీసుకున్నారు. అధికారికంగా గేమ్ చేంజర్ వర్క్ ఆగకపోయినా.. ఏదో గ్యాప్ దొరికినప్పుడు చరణ్ సినిమాను షూటింగ్ చేస్తున్నారు. ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 15, 2023 | 2:45 PM

ఒకేసారి రెండు సినిమాలతో ట్రావెల్ చేస్తున్నశంకర్ ఇప్పుడు ఓ హీరోను ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ 2 ఆగిపోవటంతో గేమ్ చేంజర్‌ను స్టార్ట్ చేసిన దర్శకుడు, కమల్ లైన్‌లోకి రావటంతో చరణ్‌ను లైట్ తీసుకున్నారు. అధికారికంగా గేమ్ చేంజర్ వర్క్ ఆగకపోయినా.. ఏదో గ్యాప్ దొరికినప్పుడు చరణ్ సినిమాను షూటింగ్ చేస్తున్నారు.

ట్రిపులార్ లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగాపవర్ స్టార రామ్ చరణ్. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ మెగా మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్.

గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే గతంలో ఆగిపోయిన ఇండియన్ 2ను కూడా లైన్‌లో పెట్టారు శంకర్. రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా ప్లాన్ చేసిన దర్శకుడు ఇండియన్ 2 మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత పట్టాలెక్కిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అయినా గేమ్ చేంజర్ వర్క్ మాత్రం ఓ కొలిక్కి రాలేదు.

ఇండియన్ 2 వర్క్ ఫినిష్ కావటంతో పార్ట్ 3కి సంబంధించిన చర్చ కూడా మొదలైంది. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ లేకపోయినా ఆల్రెడీ త్రీక్వెల్‌కు సంబంధించిన వర్క్ కూడా ఆన్ కార్డ్స్ అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ చేసిన శంకర్, మరో నలబై రోజుల పాటు షూటింగ్ చేసేలా ప్లాన్ రెడీ చేశారు. అందుకోసం ఆర్టిస్ట్‌లకు టెక్నీషియన్స్‌కు ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా ఇప్పించేందుకు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు.

ఇండియన్ 2 విషయంలో ఇంత స్పీడుగా వర్క్ చేస్తున్న శంకర్, గేమ్ చేంజర్‌ను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతున్నా ఇంత వరకు ఒక్క మేజర్ అప్‌డేట్ కూడా లేదు. దీపావళికి ఫస్ట్ సింగిల్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు.





























