- Telugu News Photo Gallery Cinema photos Trisha Krishnan Hikes Her Remuneration After Thalapathy Vijay's Leo Success
Trisha Krishnan: లియో మూవీ సక్సెస్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన త్రిష.. ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. కథానాయికల విషయంలో ఈ సామెత వర్తిస్తుంది. హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ టైమ్ తక్కువగా ఉంటుంది. అందుకే అవకాశాలున్న సమయంలోనే భారీగా పారితోషకం తీసుకోవాలనుకుంటారు. త్రిష విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
Updated on: Nov 15, 2023 | 2:03 PM

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. కథానాయికల విషయంలో ఈ సామెత వర్తిస్తుంది. హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ టైమ్ తక్కువగా ఉంటుంది. అందుకే అవకాశాలున్న సమయంలోనే భారీగా పారితోషకం తీసుకోవాలనుకుంటారు.

త్రిష విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఇటీవలే విజయ్ దళపతితో కలిసి లియో సినిమాలో నటించింది త్రిష. దసరా కానుకగా విడుదలైన ఈ యాక్షన్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది.

సెకెండ్ ఇన్నింగ్స్‌లో త్రిష అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ -1,2 సినిమాలతో భారీ హిట్స్ కొట్టేసిన ఈ అమ్మడు లియో మూవీతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే తన పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉంది త్రిష. తన తర్వాతి సినిమాల కోసం భారీ పారితోషకం డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం త్రిష అజిత్ కుమార్ విడా ముయార్చితో పాటు కమల్ హాసన్ KH234 మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటి కోసం సుమారు రూ. 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.




