- Telugu News Photo Gallery Cinema photos Niharika Konidela And Vithika Sheru Visited Assam Kamakhya Temple, See Photos
Niharika: ఆ హీరో భార్యతో మెగా డాటర్ నిహారిక.. ప్రఖ్యాత ఆలయంలో పూజలు.. ఫొటోస్ ఇదిగో
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు వెకేషన్ లో బిజి బిజీగా గడుపుతోంది. తన ఫ్రెండ్స్ తో కలిసి దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టేస్తోంది. తాజాగా నిహారిక ఓ ప్రముఖ ఆలయాన్ని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Aug 17, 2025 | 8:07 PM

మెగా డాటర్ నిహారిక ఈ మధ్యన టూర్లు, వెకేషన్స తో బిజి బిజీగా ఉంటోంది. తన స్నేహితులతో కలిసి దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తోంది.

అలాగే ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక స్థలాలను కూడా దర్శించుకుంటోంది నిహారిక. తాజాగా ఆమె అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని దర్శించుకుంది

ఈ సందర్భంగా వరుణ సందేశ్ భార్య వితికా షేరు కూడా నిహారిక వెంట ఉంది. ఇద్దరూ కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నిహారిక, వితిక. అలా తాజాగా కామాఖ్య టెంపుల్ దర్శనానికి సంబంధించిన ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది వితిక

'నా శక్తి పీఠ యాత్రలో మరో అద్భుతమైన అధ్యాయం… ఈ రోజు మాతా కామాఖ్యా దేవి దర్శనం. ఇక్కడి ఆధ్యాత్మిక తరంగాలు, ఆ భక్తి వాతావరణం… మాటల్లో చెప్పలేనివి'

'అమ్మ చరణాల వద్ద నిలబడిన క్షణం… మనసు పూర్తిగా సమర్పించుకుంది. ఈ యాత్రలో ప్రతి పీఠం ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త బోధ. ధన్యవాదాలు అమ్మా, ఈ పవిత్ర యాత్రలో నన్ను నడిపిస్తున్నందుకు' అని రాసుకొచ్చింది వరుణ్ సందేశ్ భార్య.




