- Telugu News Photo Gallery Cinema photos Do you know Balakrishna super hit movie that running for 1005 days in a single theater?
ఒకే థియేటర్‌లో 1005 రోజులు ఆడిన బాలయ్యబాబు క్రేజీ మూవీ ఏదో తెలుసా?
బాలయ్య బాబు సినిమాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక ఈయన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? బాలకృష్ణ సినిమాల్లో ఒక సినిమా మాత్రం ఒకే థియేటర్లో ఏకంగా 1005 డేస్ ఆడిందంట. ఇంతకీ ఆ మూవీ ఏదో తెలుసుకుందాం.
Updated on: Aug 17, 2025 | 5:54 PM

చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సూపర్ హిట్ అందుకుంటే, మరి కొన్ని ప్లాప్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం ఏకంగా వంద, రెండు వదలు ఇలా వెయ్యి రోజులు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. కొన్ని సార్లు భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు తక్కువ రోజులు ఆడటం చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యి, మంచి కలెక్షన్స్ రాబట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Balakrishna

ఈ క్రమంలోనే నెట్టింట ఓ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. అది ఏమిటంటే? ఇప్పటి వరకు ఒక్క థియేటర్లోనే ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏదీ? కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముద్దుల క్రిష్ణయ్య, అనసూయమ్మ గారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు, భైరవ ద్వీపం, సింహా, అఖండ వంటి ఎన్నో సినిమాలు రికార్డ్ క్రియేట్ చేశాయి

అలాగే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో లెజెండ్ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమా కడప జిల్లాలోని పొద్దుటూరు అనే ఊరిలో అర్జున్ థియేటర్ లో 1005 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసిందంట.సినిమా ఇండస్ట్రీలోనే ఇది పెద్ద రికార్డే అంటున్నారు అభిమానులు.



