Rashmika Mandanna: యానిమల్ పోస్టర్ అలా రిలీజ్‌తో రష్మికపై నెటిజన్లు ఫోకస్.. ఆమె కెరీర్ సంగతి ఏంటో..
యానిమల్ పోస్టర్ అలా రిలీజ్ అయిందో, లేదో, వెంటనే రష్మిక కెరీర్ మీద ఫోకస్ పెంచేశారు నెటిజన్లు. హిందీలో రష్మిక చేసిన సినిమాలేంటి? సక్సెస్ రేషియో ఎంత? కోలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల కౌంట్ ఎంత అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్లు విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ రష్మిక పరిస్థితేంటి? రంజితమే రంజితమే అంటూ వారిసు సినిమాలో రష్మికతో విజయ్ స్టెప్పులేసిన తీరు చూసి, కోలీవుడ్ నుంచి ఇక నాన్‌స్టాప్‌గా అవకాశాలు రష్మిక తలుపుతడుతాయని అనుకున్నారు జనాలు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఆమె ఫస్ట్ సినిమా సుల్తాన్ తర్వాత కూడా పెద్దగా అటు వైపు నుంచి ఆఫర్స్ ఏమీ రాలేదు రష్మికకు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




