- Telugu News Photo Gallery Cinema photos Tamil stories creates Buzz in Bollywood Telugu Entertainment Photos
Tamil – Bollywood: కమాన్ కోలీవుడ్.. తమిళ కథలకు బాలీవుడ్ లో క్రేజ్..!
బాలీవుడ్‌కి వెళ్లి నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. నేనిప్పుడు ఆ ట్రయల్స్ లోనే ఉన్నా. నేను సక్సెస్ అయితే నాలాంటి వాళ్లకు ఎంతో మందికి రూట్ మ్యాప్ రెడీ అయినట్టేనని జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు కెప్టెన్ అట్లీ. అది జస్ట్ టెక్నీషియన్ల విషయంలో మాత్రమే కాదు, సినిమాల విషయంలోనూ నిజమవుతోంది. కోలీవుడ్ కథలకు నార్త్ లో రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రెడీ టు డు రీమేక్స్ అంటున్నారు.
Updated on: Sep 25, 2023 | 3:03 PM

బాలీవుడ్‌కి వెళ్లి నిలదొక్కుకోవడం మామూలు విషయం కాదు. నేనిప్పుడు ఆ ట్రయల్స్ లోనే ఉన్నా. నేను సక్సెస్ అయితే నాలాంటి వాళ్లకు ఎంతో మందికి రూట్ మ్యాప్ రెడీ అయినట్టేనని జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు కెప్టెన్ అట్లీ. అది జస్ట్ టెక్నీషియన్ల విషయంలో మాత్రమే కాదు, సినిమాల విషయంలోనూ నిజమవుతోంది. కోలీవుడ్ కథలకు నార్త్ లో రెడ్ కార్పెట్ వేస్తున్నారు.

రెడీ టు డు రీమేక్స్ అంటున్నారు. సూరరై పోట్రు కాన్సెప్ట్ తమిళ్‌లోనే కాదు, తెలుగు వాళ్లను కూడా మెప్పించింది. ఆకాశం నీ హద్దురా పేరుతో తెలుగులో విడుదలైంది ఈ సినిమా. మనసులో ఉన్న ఆశయాన్ని సాధించిన గోపీనాథ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన గెలుపు కథ ఇది.

అందులో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్, యాక్షన్... ప్రతిదీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అందుకే జాతీయ స్థాయిలో పురస్కారాలు తెచ్చుకుంది ఈ సినిమా. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ని బాలీవుడ్‌లో సుధ కొంగర డైరక్షన్‌లో అక్షయ్‌కుమార్ చేస్తున్నారు.

అట్లీ జవాన్‌తో సక్సెస్ కొట్టి చూపించారు. సౌత్‌లో సూపర్‌హిట్ అయిన విజయ్ మూవీ తెరి ఇప్పుడు నార్త్ లో సినిమాగా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌ధావన్ నటిస్తున్నారు. వెరీ బిగ్ కలెక్షన్లు గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వరుణ్ టీమ్‌లో.

చిన్న సినిమా అయినా యూత్‌కి కనెక్ట్ అయితే కాసులు ఎలా కురుస్తాయో ప్రూవ్ చేసిన సినిమా లవ్ టుడే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమికుల మధ్య సోషల్ మీడియా ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందో చెప్పి సక్సెస్ అయిన సినిమా. నార్త్ లో జునైద్ ఖాన్‌తో రీమేక్ చేస్తున్నారు.

తమిళ్‌లో సక్సెస్‌ఫుల్ కాన్సెప్ట్ కోమాలి కూడా నార్త్ లో రీమేక్ అవుతోంది. అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు కంటెంట్ ఉత్తరాదిన హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేది. ఇప్పుడు టర్మ్ తమిళ్ సినిమాలది. ఈ వరుసలో ఇంకెన్ని సినిమాలు ఉత్తరాది బాట పడుతాయని ఆసక్తిగా చూస్తున్నారు తంబిలు.




