- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood news update in film industry on 25 09 2023 Telugu Entertainment Photos
Entertainment: వాట్ ఏ క్యూట్ నెస్.. బన్నీ అర్హ ఫొటో..| ఈసారి సింగం లేడీ..
కుమార్తె అల్లు అర్హతో సరదాగా తీసుకున్న వీడియో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. 'ఎందుకు నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావు. కొంచెం క్యూట్ అయితే ఓకే. మరీ ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావ్' అంటూ పాపను ముద్దుచేసే వీడియో వైరల్ అవుతోంది. డాటర్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేశారు బన్నీ. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్, రణ్‌వీర్‌సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా సింగం అగైన్. దీపిక పదుకోన్, టైగర్‌ష్రాఫ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.
Updated on: Sep 25, 2023 | 4:16 PM

కుమార్తె అల్లు అర్హతో సరదాగా తీసుకున్న వీడియో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. 'ఎందుకు నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావు. కొంచెం క్యూట్ అయితే ఓకే. మరీ ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావ్' అంటూ పాపను ముద్దుచేసే వీడియో వైరల్ అవుతోంది. డాటర్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేశారు బన్నీ.

అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్, రణ్‌వీర్‌సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా సింగం అగైన్. దీపిక పదుకోన్, టైగర్‌ష్రాఫ్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కరీనా కీ రోల్ చేస్తున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి నటించడానికి ఆనందంగా ఉందని చెప్పారు కరీనా.

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్. గ్రాఫిక్స్ పనులు పూర్తి కానందువల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా గురించి లేటెస్ట్ గా శ్రుతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమా లార్జర్ దేన్ లైఫ్ అని అన్నారు శ్రుతి. ప్రభాస్ వండర్‌ఫుల్ పర్సన్ అని, చాలా హంబుల్‌గా ఉంటారని చెప్పారు.

నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇరైవన్. తెలుగులో ఈ సినిమాను 'గాడ్' పేరుతో విడుదల చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పారు మేకర్స్. ఈ నెల 28న విడుదల కానుంది 'ఇరైవన్'.

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'లక్కీ భాస్కర్' అనే సినిమా షూటింగ్ మొదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఉన్నత శిఖరాలకు చేరిన సాధారణ మనిషి చేసిన అసాధారణమైన ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.




